హైదరాబాద్

అడుగడుగునా అడ్డంకులే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 24: మెట్రో కారిడార్ పాతబస్తీ మార్గానికి గ్రహణం పట్టుకుంది. అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఓవైపు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్‌లు నడుస్తుంటే..ఇక్కడ అసలు అలైన్‌మెంట్ కూడా తేలలేదు. దీంతో అసలు పాతబస్తీకి మెట్రోప్రాజెక్టు వస్తుందా ఆన్న సందేహం తలెత్తుతోంది. మెట్రోప్రాజెక్టులో భాగంగా పాతబస్తీ నుండి సికింద్రాబాద్, కంటోనె్మంట్ వరకు మెట్రోకారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదన రూపొందించారు. గత రెండేళ్లుగా అలైన్‌మెంట్ సంగతే ఇప్పటి వరకు తేలకపోవటంతో పనులు ప్రారంభం కావటం లేదు. నగరంలో ఓవైపు మెట్రోపనులు శరవేగంగా కొనసాగుతున్నా..పాతబస్తీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మొత్తం కారిడార్‌లో భాగంగా 70 కి.మీ మార్గంలో కేవలం 20 కి.మీ మేరకు మాత్రమే నిర్మాణం పూర్తయ్యింది. మెట్రోరాకతో పాతబస్తీ రూపురేఖలు మారుతాయని భావించిన ప్రజలకు చుక్కెదురవుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతివస్తే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని, ఇందుకు ప్రణాళిక, నిధులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా రాజకీయ గ్రహణంతో ఆటంకాలు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లులెత్తుతున్నాయి. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్ గూర్చి చర్చకు వచ్చినప్పుడు మంత్రి కెటిఆర్ దీనిపై తీవ్రంగానే స్పందించారు. సమావేశాలు ముగిసిన తర్వాత అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి పాతబస్తీ అలైన్‌మెంట్‌ను నిర్ణయిస్తామని ప్రకటించారు. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా అఖిలపక్షం ఊసేలేదు. దీంతో ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టు భాగ్యం అసలు పాతబస్తీకి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అఖిలపక్షం సమావేశం జరిగేదెప్పుడు, అలైన్‌మెంట్ నిర్ణయించేదెప్పుడు, పనులు ప్రారంభమయేదెప్పుడు అని సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక వేళ అఖిలపక్షం జరిగినా రాజకీయపక్షాలనుండి ఏకాబిప్రాయం వస్తుందా అని పాతబస్తీ వాసులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వచ్చే సంవత్సరం జూలై నాటికి ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండగా చాలా ఆలస్యమయ్యింది.