హైదరాబాద్

నిరక్ష్యానికి నిండు ప్రాణాలు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఖైరతాబాద్, జూలై 24: గ్లోబల్ సిటీ, వరల్డ్ స్టాండర్డ్ సిటీ అని అమాత్యులు ప్రకటనలు చేస్తున్నా మహానగరంలో అక్రమ నిర్మాణాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, శిధిలావస్ధకు చేరిన భవనాలు కుప్పకూలుతూ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నివారించడంలో ఇచ్చిన అనుమతుల ప్రకారం భవనాల నిర్మాణాలు కొనసాగించడంలో, కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లో జరిగే ప్రాణనష్టాన్ని నివారించడంలో జీహెచ్ ఎంసి పూర్తిగా విఫలమవుతోందని విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఇప్పటి వరకు శిధిలావస్థలో ఉన్న భవనాలు వర్షాకాలంలో కుప్పకూలి పలువురు ప్రాణాలు కోల్పొయిన సంఘటనలు జరగగా, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న భవనం (అక్రమ నిర్మాణం) కుప్పకూలి బతుకు తెరువు కోసం వచ్చిన కార్మికులు శిథిలాల కింద ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని శిధిలావస్థకు చేరిన సిటిలైఫ్ హోటల్, అంతకముందు నారాయణగూడ నిర్మాణంలో ఉన్న స్కూల్ భవనం, కొద్ది రోజుల క్రితం హుస్సెనీ అలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానాలో నిర్మాణంలో ఉన్న ట్రస్ట్ భవనం కూలిపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జిహెచ్‌ఎంసి అనుమతులు ఉండి, వాటిని అతిక్రమించి, అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు ఈ రకంగా కొనసాగుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజల ప్రాణాలను బలిగొట్టున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. తాజాగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో హడావుడిగా చేపట్టిన అక్రమ నిర్మాణం కుప్పకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పొందిన సంఘటన నగరంలో చర్చనియాంశమైంది. భవన నిర్మాణ అనుమతుల జారీ, అక్రమ నిర్మాణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి వీటిలో పారదర్శకత సాధిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయి. మహానగరంలో నేటికి స్వరాష్ట్రం, స్వపరిపాలన హయాంలలో బడా బాబుల అక్రమ నిర్మాణాలు ఎదేచ్చగా కొనసాగుతున్నాయనడానికి ఫిలినంగర్ సంఘటన ఒక ఉదాహరణ. ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు ఆమ్యామ్యాల కోసం కార్యాలయాల చుట్టు తిప్పుకునే టౌన్‌ప్లానింగ్ అధికారులు కనీసం ఇచ్చిన అనుమతి ప్రకారం నిర్మాణాలు కొనసాగుతున్నాయా అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడం విఫలం అవుతున్నారు. ఎన్ని సార్లు కోర్టులు ఆక్షింతలు వేసినా ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలను తమ స్వంత ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూ కార్మికుల ప్రాణాలు బలికావడానికి కారకులౌతున్నారు. నగరంలో నిర్మించిన ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని సమైక్యాంధ్రలో దివంగత సీఎం వైస్, ప్రత్యేక రాష్ట్రంలో సిఎం కేసిఆర్ ప్రకటించినా వారు ఆదేశాలు ఏ మాత్రం అమలు కావడం లేదు. పైగా అక్రమ నిర్మాణాలు జిహెచ్ ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారుల పాలిట వరంగా మారాయి. ప్రతి సర్కిల్ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాలను పసిగట్టి ప్రాధమిక స్థాయిలో అడ్డుకునేందుకు పనిచేయాల్సిన సెక్షన్ అధికారులు చైన్‌మెన్లు లంచాలకు తలొగ్గి వౌనంగా ఉండటం వల్లే ఇలాంటి నిర్మాణాలు కూలిపోయి పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ఆన్‌లైన్, నిర్మాణాలపై నిఘ అని చెప్పుకునే ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మరోసారి పరిహారం చెల్లించి వౌనం వహిస్తారా..?, నిర్మాణంలో ఉన్న భవనాలైన కూలకుండా చూస్తారా అనే సందిగ్ద స్తితులను వేచిచూడాల్సిందే.