హైదరాబాద్

మిగులు బడ్జెట్ కాదు.. అప్పుల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 27: దేశంలోకెల్లా మిగులు బడ్జెట్ గల రాష్ట్రం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్.. అప్పుల తెలంగాణగా మార్చారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పుడే మేల్కొని తిరుగుబాటు చేయకపోతే చిప్ప చేతిలో పెడతాడని ధ్వజమెత్తారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కులాల బిసి ఫెడరేషన్ల సహకార సంఘాల సమాఖ్య సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఏటా రూ.25వేల కోట్లు అప్పులు తెస్తూ అప్పుల తెలంగాణగా మార్చారని ద్యుయబట్టారు. బిసి కులాలను నిర్వీర్యం చేస్తూ ఫెడరేషన్లకు నిధులు కేటాయించటంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధులను సైతం కాంట్రాక్టర్లకు దారి మళ్లిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బిసి ఫెడరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం హాజరై సంఘీభావం తెలిపి ప్రసంగించారు. సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులు అనంతోజు వెంకటాచారి, మంకోజు కనకాచారి మాట్లాడుతూ అన్ని కులాల బిసి ఫెడరేషన్లకు ప్రభుత్వ పాలక మండలి నియమించాలని డిమాండ్ చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సర సబ్సిడీ రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నందున వెంటనే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు లాలాకోట వెంకటాచారి, కుల సంఘాల ప్రతినిధులు ఆర్.పాండురంగాచారి, రాగి రామాణుజాచారి, శ్రీలత, అమృత, సంఘం ప్రతినిధులు గన్నోజు శేఖరాచారి, జి.రాజ్యలక్ష్మి, భవాని పాల్గొన్నారు.