హైదరాబాద్

మహిళలకు పూర్తి భరోసానిస్తున్న తెలంగాణ పోలీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: రోజు రోజుకూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, అనుకోని పరిస్థితుల్లో ఎదురవుతున్న సంఘటనలను ఎదుర్కొనేందుకు గాను వారికి పూర్తి స్థాయి భరోసానిస్తుంది తెలంగాణ పోలీసు అని బేగంపేట్ మహిళ పోలీసు ఇన్స్‌పెక్టర్ పి.జానకమ్మ అన్నారు. మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్‌తో పాటు ప్రత్యేక యాప్‌లను రూపొందించి వారిలో పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. అందులో భాగంగానే ఉత్తర మండలం డిసిపి బి.సుమతి పర్యవేక్షణలో మహిళల్లో, కాలేజీ విద్యార్థినిల్లో మనో దైర్యం నింపడం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తర మండలం పరిధిలోని దాదాపు 49 ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థినిల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీ టీమ్స్, హకాయ్(డేగ కన్ను) వంటి యాప్‌లను మహిళల రక్షణ కోసం వినియోగిస్తున్న తీరు తెన్నుల గురించి పలువురు క్షణంగా వివరించారు. మహిళలకు రక్షణ, భరోసా అన్న అంశంపై జరిగిన ఈ అవగాహన సదస్సులో పోలీసు ఉన్నతాధికారులతో పాటు న్యాయవాది రాజేష్, బేగంపేట డివిజన్ ఏసిపి ఎస్.రంగారావు ప్రసంగించి అనుకోని పరిస్థితుల్లో మహిళలు, యువతులు, విద్యార్థినిలకు ఎదురయ్యే సంఘటనల పట్ల వ్యవహరించాల్సి తీరు తెన్నులపై వివరించారు. ప్రత్యేకంగా మహిళలు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్లినపుడు వారు వెంటనే వారు వెడుతున్న కారు, తదితర వివరాలను పోలీసు విభాగం రూపొందించిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వాటి వల్ల కలిగే లాభాలు అధికంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నేరుగా పోలీస్టేషన్‌కు వచ్చి తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా పోలీసు యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు తక్షణమై ఆప్రాంతానికి పోలీసులు చేరుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సదస్సులో పాల్గొన్న వివిధ కళశాలలకు చెందిన విద్యార్థినిలు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల రక్షణ, యువతులు, విద్యార్థినిల భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమోఘం అన్నారు. ప్రస్తుతం పోలీసు విభాగంలో పనిచేస్తున్న షీ టీమ్స్ పోలీసులకు ప్రభుత్వం అధనంగా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని మరిన్ని అధికారాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు తదితరులు పాల్గొన్నారు.