హైదరాబాద్

వివాహం ఆగిపోయిందని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 31: వివాహం ఆగిపోయిందని తీవ్ర మానసిక ఆవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ (38) చాలా కాలంక్రితం నగరానికి వచ్చాడు. క్రాంతిశిఖర అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో ఉంటూ వీడియో ఎడిటింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు.
ఇటీవల రాజశేఖర్‌కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. కాగా పెద్దలు వధూవరులకు పేరు బలం కుదరడం లేదని వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్రంగా ఒత్తిడికి గురైన రాజశేఖర్ ఆదివారం మధ్యాహ్నం తాను ఉంటున్న గదిలోనే ఊరిబిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.