హైదరాబాద్

డివిజన్ల రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రోజుకో మలుపు మహానగర పాలక సంస్థ ఎన్నికల వ్యవహారాన్ని ఎట్టకేలకు సర్కారు గాడిన పెట్టింది. శుక్రవారం అనూహ్యంగా డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. వివిధ సామాజికవర్గాలకు, మహిళలకు కేటాయించిన డివిజన్ల వారీగా రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నాయి. కాగా, టిఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు అనుకూలంగా ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లను ఖరారు చేసిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, విపక్షాలు టిడిపి, బిజెపిలు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తాజాగా ఖరారైన రిజర్వేషన్లను గమనిస్తే మజ్లిస్ బలంగా ఉన్న పాతబస్తీ వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ ఇదివరకు ఒకటి, రెండు పర్యాయాలుగా కార్పొరేటర్లుగా వ్యవహరించిన వారినే అభ్యర్థులుగా రంగంలో దింపటం, రిజర్వేషన్లలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవటంతో ఆ పార్టీకి గత పాలక మండలిలో ఉన్న బలం పెరగటం మాట అలా ఉంచితే, బాగా తగ్గుతుందనేందుకు అవకాశం కూడా అంతంతమాత్రంగానే కన్పిస్తోంది.