ఆంధ్రప్రదేశ్‌

హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 24: శాసన సభ వర్షకాల సమావేశాలు సెప్టెంబర్ 8 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అమరావతిలోనే వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని భావించినా పూర్తి స్థాయి సౌకర్యాలు లేని కారణంగా సమావేశాలు ఈసారి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిఎస్‌టి బిల్లును సెప్టెంబర్ 8లోగా రాష్ట్రాలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ఇప్పటికే జిఎస్‌టి బిల్లును 122వ రాజ్యాంగ సవరణగా పార్లమెంట్ ఆమోదించిందన్నారు. అయితే ఆ బిల్లు పూర్తిస్థాయిలో చట్టం కావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉందన్నారు. ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాలు జిఎస్‌టి బిల్లును ర్యాటిపై చేసి కేంద్రానికి పంపాయన్నారు. జిఎస్టీ బిల్లును 2017 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తేవడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించిందన్నారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశాన్ని సెప్టెంబర్ 8న బిఎసి (బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ సమావేశం) లో నిర్ణయిస్తామన్నారు. ఆ రోజే జిఎస్‌టి బిల్లును ఆమోదించే విధంగా సభను కోరతామన్నారు. ప్రతిపక్షాలు సృష్టిస్తే మినహా ఈసారి రాష్ట్రంలో పెద్దగా సమస్యలేమీ లేవని కేవలం నాలుగైదు రోజులే సమావేశాలు జరిగే అవకాశాలున్నాయని యనమల ప్రకటించారు. బిల్లుకు సంపూర్ణ మద్దతివ్వాలని ప్రతిపక్షాలను కోరతామన్నారు. బిల్లు ఆమోదం తప్పనిసరి కాబట్టి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయన్న ఆశాభావాన్ని యనమల వ్యక్తం చేశారు. ఈబిల్లు ఆమోదం పొందిన తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటవుతుందని, ఆ కౌన్సిల్ బిల్లులో ముఖ్యాంశాలు, రాష్ట్రాల వాటా వంటి అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సిన రూ.930కోట్ల బకాయిలపై కూడా వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామన్నారు.