హైదరాబాద్

పండుగల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: మహానగర పోలీసులకు వరుసగా వచ్చిన పండుగల బందోబస్తు ఫీవర్ పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు పొరుగు జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్గొండల్లోని పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసులకు త్వరలోనే మరోసారి ఉరుకులు, పరుగులు తప్పవు. నగరంలోని ఇరువర్గాలకు చెందిన పండుగలు వరుసగా రావటంతో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు సవాలుగా మారింది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 12న బక్రీద్ పండుగ రావటంతో పోలీసులు ఈ రెండు పండుగలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయటంలో తలమునకలయ్యారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున, మధ్యలో 12న బక్రీద్, ఆ తర్వాత 15న వినాయక నిమజ్జనం సందర్భంగా చేపట్టాల్సినబందోబస్తు కారణంగా నిన్నమొన్నటి వరకు పుష్కరాల్లో విధులు నిర్వహించిన పోలీసులకు మరోసారి ఉరుకులు పరుగులు తప్పని పరిస్థితిలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే రెండురోజుల క్రితం జిహెచ్‌ఎంసి, పోలీసు, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారులు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన రెండురోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే! ముఖ్యంగా ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారంటూ పలు చోట్ల గోరవాణాను అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు వంటి సంఘటనలు చోటుచేసుకునేవి. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా తయారైంది. వచ్చే నెల 12వ తేదీన బక్రీద్ పండుగ రావటం, అప్పటికే మండపాల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరి ఉండటం పోలీసులకు తలభారంగా మారనుంది. ముఖ్యంగా పాతబస్తీలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే సంఘటనలు చోటుచేసుకోకుండా వివిధ శాఖల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు వ్యూహాన్ని రచిస్తున్నారు. అంతేగాక, ప్రతి వినాయకుడి మండపం వద్ధ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణ, ఇతర జాగ్రత్తలపై స్వచ్ఛ వాలంటీర్లను నియమించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ వెల్లడించారు. అంతేగాక, పలు ప్రాంతాల్లో వినాయక మండపాలు రోడ్లకిరువైపులా కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నందున బక్రీద్ వ్యర్థాలను స్థానికులు ఎక్కడబడితే అక్కడ వేయకుండా వ్యర్థాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లోని స్థానికులకు వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాస్టిక్ కవర్లను పంపిణీ చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
గోవుల అక్రమ రవాణ నియంత్రణకు 35 చెక్‌పోస్టులు
బక్రీద్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలించటం, వాటిని మరో వర్గం ప్రజలు అడ్డుకోవటం వంటి సంఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్‌లలో 35 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ పరిధిలో 20, హైదరాబాద్ పరిధిలో 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, జంతువులను తరలించే వాహనాలకు సరైన ఆధారాలు ఉంటేనే అనుమతించాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేయాలని అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.