హైదరాబాద్

కిలోకి పంచదార 600 గ్రాములే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: షాపింగ్ మాల్స్‌లో ఇప్పటి వరకు నాణ్యత లోపం.. నాసిరకం.. అధిక ధరలకు విక్రయాలు.. నకిలీ మసాలాలు.. కల్తీ నూనె వంటి అభియోగాలు వచ్చాయి. ప్రస్తుతం తూకంలో మోసం చేస్తున్న విషయాన్ని పసిగట్టలేక పోతున్నాం.
తాజాగా సోమవారం ఎల్‌బి నగర్‌లోని ‘డి’మార్ట్‌లో తూకంలో మోసం వెలుగుచూసింది. కిలోకి పంచదార 600 గ్రాములే ఉన్న ప్యాకెట్‌ను ఓ వినియోగదారుడు కనుగొన్నాడు. వెంటనే తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తూనికలు, కొలతల శాఖ అధికారులు ‘డి’మార్టులో తనిఖీ చేశారు. వెయింగ్ మిషన్లను పరిశీలించారు. వెయ్యి గ్రాములు ముద్రతో ఉన్న బట్ (తూనిక) తూకం వేయగా కిలోకి 600 గ్రాములే వచ్చింది. నాలుగు వందల గ్రాముల చక్కెర తక్కువగా ఉండడాన్ని కనుగొన్నారు.
వెయింగ్ మిషన్లతోపాటు తూనికలను స్వాధీనం చేసుకున్నారు. ‘డి’మార్టు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవల ‘డి’మార్ట్‌లోనే ఓ నూనె ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక రావడంతో వినియోగదారులు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది రెండో కేసుగా నమోదైనట్టు తెలిసింది.