హైదరాబాద్

ఒక జిల్లా..రెండు స్వ‘రూపా’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: పరిపాలన సౌలభ్యం..అభివృద్ధి వేగవంతం ప్రాతిపదికలతో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునఃవ్యవస్థీకరణ ప్రభావం హైదరాబాద్ నగరంలో అంతంతమాత్రంగానే కన్పించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం రెవెన్యూ పరంగా 16 మండలాలతో ఉండగా, అదే శివార్లలోని రంగారెడ్డి, మెదక్ రెవెన్యూ జిల్లాలోని పనె్నండు మున్సిపాల్టీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్‌గా పదేళ్ల క్రితం రూపాంతరం చెందింది. ప్రస్తుతం గ్రేటర్‌లో హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని 16 మండలాలు, ఏడు సర్కిళ్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పది శివారు మున్సిపాల్టీలు, మెదక్‌లోని మరో రెండు మున్సిపాల్టీలున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలోనూ జిహెచ్‌ఎంసి సొంత నిధులతో పౌరసేవల నిర్వహణ, వౌలిక వసతులు వంటి కీలకమైన విధులు చేపడుతోంది. కానీ జిల్లా పునఃవ్యవస్థీకరణ తర్వాత కూడా రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైనా హైదరాబాద్ గ్రేటర్ పరంగా, రెవెన్యూ జిల్లా పరంగా అదే రెండు విస్తీర్ణాలను, భౌగోళిక స్వరూపాలను కలిగి ఉండే అవకాశాలున్నాయి. గ్రేటర్‌కు ముందు, గ్రేటర్‌గా మారిన తర్వాత కూడా హైదరాబాద్ రెవెన్యూ జిల్లా కల్గిన దాదాపు 272 కిలోమీటర్ల విస్తీర్ణమే జిల్లాల పునఃవ్యవస్థీకరణ ముందు అలాగే ఉండనుంది. కానీ ఉత్తరం, దక్షిణం వైపులా స్వల్పంగా మార్పులు జరిగే అవకాశాల్లేకపోలేవు. పొరుగు జిల్లా అయిన రంగారెడ్డి మూడు ముక్కలయ్యే అవకాశముండగా, హైదరాబాద్ జిల్లా మాత్రం ప్రస్తుతమున్న రెవెన్యూ జిల్లా విస్తీర్ణానికి పరిమితమయ్యే అవకాశముంది. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా పునఃవ్యవస్థీకరణలో భాగంగా ఒకవైపు శివార్లలోని పలు మండలాలు హైదరాబాద్ జిల్లాలో కలిసే అవకాశముండగా, మరోవైపు కొన్ని ప్రాంతాలను కొత్తగా ఏర్పడనున్న మల్కాజ్‌గిరి జిల్లాలో కలిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోకి వచ్చే తిరుమలగిరి మండలం ఏరియా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలతో కొత్తగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లా మల్కాజ్‌గిరిలో కలిపే అవకాశాలుండగా, అలాగే దక్షిణం వైపున్న మహేశ్వరం మండలం మొత్తాన్ని గానీ, అందులో కొంత భాగాన్ని గానీ హైదరాబాద్‌లో కలిపే అవకాశాలున్నాయి. అంటే జిల్లాలో ఉత్తరం వైపున్న తిరుమలగిరి మండలంలోని ప్రాంతాలు మల్కాజ్‌గిరి రెవెన్యూ జిల్లాలో కలిపినా, దక్షిణం వైపున్న మహేశ్వరం మండలంలోని పలు ప్రాంతాలను హైదరాబాద్ జిల్లాలో విలీనం చేసే అవకాశాలుండటంతో హైదరాబాద్ రెవెన్యూ విస్తీర్ణంలోనూ, స్వరూంపలోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
కష్టతరంగా మారనున్న పౌరసేవల నిర్వాహణ
జిల్లాల పునఃవ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత జిహెచ్‌ఎంసి విస్తీర్ణం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో పౌరసేవల నిర్వహణ కొంతకాలం కార్పొరేషన్‌కు కష్టతరంగా మారనుంది. ఇప్పటికే మెరుగైన సేవలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అధికారులతో జిహెచ్‌ఎంసి ఎప్పటికపుడు సమన్వయం చేసుకోంటుంది. దీనికి తోడు కేంద్ర పాలిత ప్రాంతంగా అన్పించే కంటోనె్మంట్ బోర్డును కూడా జిహెచ్‌ఎంసి పలు సందర్భాల్లో కీలకమైన అభివృద్ధి, అత్యవసరమైన సేవల కోసం సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే! విషయంలో ఈ పునఃవ్యవస్థీకరణ తర్వాత రంగారెడ్డిలో అదనంగా ఏర్పడనున్న మల్కాజ్‌గిరి జిల్లా కూడా పైన పేర్కొన్న జిల్లాల జాబితాలో చేరనుంది. దీంతో జిహెచ్‌ఎంసి సమన్వయం చేసుకోవల్సిన రెవెన్యూ జిల్లా సంఖ్య నాలుగుకు చేరనుంది. రాష్ట్రంలో జిల్లా సంఖ్య పెరగటంతో జిహెచ్‌ఎంసి పరిధిలో మెరుగైన సేవలందించేందుకు కార్పొరేషన్ కూడా సమన్వయం పెంచుకునే జిల్లా సంఖ్య పెరగనుందని చెప్పవచ్చు.