హైదరాబాద్

ఫిల్మ్ నగర్ సెంటర్‌కు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27:జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌ను పూర్తి స్ధాయిలో తెరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో, ఫిల్మ్‌నగర్ కల్చరరల్ సెంటర్‌ను జిహెచ్‌ఎంసి సీజ్ చేసిన విషయం విధితమే. ఈ సెంటర్‌ను తెరిపించే విధంగా జిహెచ్‌ఎంసికి ఆదేశాలు ఇవ్వాలని చేసిన వినతిని పరీశీలించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిర్ణయాన్ని జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రకటించారు. జిహెచ్‌ఎంసి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారన్నారు. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరిగిందన్నారు. కాగా నిర్మాణంలో ఉన్న భవనంలో లోపాలను సరిదిద్దేందుకు అనుమతిని ఇస్తూ , సభ్యులకు మాత్రం ఎటువంటి అనుమతి లేదని, ఈమేరకు నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.