హైదరాబాద్

నేడు హైదరాబాద్ మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పీపుల్స్‌ప్లాజా నుంచి నిర్వహించనున్న హైదరాబాద్ రన్‌కు జిహెచ్‌ఎంసి విస్త్రృత ఏర్పాట్లు చేసింది. ఉదయం అయిదు గంటల 45 నిమిషాలకు నెక్లెస్‌రోడ్డులోని పుపీల్స్‌ప్లాజాలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి ఈ రన్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నెక్లెస్‌రోడ్డు నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్ మీదుగా రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, ఓల్డ్ ముంబై జాతీయ రహదారి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మీదుగా గచ్చిబౌలీలోని జిఎంసి బాలయోగి స్టేడియం వరకు దాదాపు 42.19 కిలోమీటర్ల మేరకు కొనసాగనున్న ఈ రన్‌కు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రన్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరిలో క్రీడాస్పూర్తితో పాటు దేశ సమగ్ర, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రన్ సాగనున్న ఆయా మార్గాల్లో ఇతర అవసరమైన ఏర్పాట్లన్నింటిని చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొనే ఈ రన్‌లో దాదాపు 24 అడుగుల ఎత్తు కల్గిన మారథాన్ రన్ బ్యానర్‌ను జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా రూపొందించింది. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ్భారత్ అంశాలపై ఫ్రజలను చైతన్యపరిచేందుకు ఈ బ్యానర్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రన్ కొనసాగే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై హైదరాబాద్ నగరం, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వేలాది మంది పాల్గొనే ఈ రన్ కారణంగా పోలీసులు రన్ జరిగే రూట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రన్‌లో జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు, పౌరులు, యువతీయువకులు స్వచ్ఛంధంగా పాల్గొని రన్‌ను విజయవంతం చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.