హైదరాబాద్

తెలంగాణలో కళలను బతికించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్రంలో కళారూపాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, గిరిజన్ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. తెలంగాణలో ఎన్నో కళలు మరుగున పడిపోయాని, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాడిన తరువాత కళాకారులకు గుర్తింపు వచ్చిందని, అంతరించిపోతున్న జానపద కళలను వెలికితీసి కళాకారులకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించని మంత్రి పేర్కొన్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలోని పది జిల్లాలో జరిగిన జానపద జాతర-2016 ఉత్సవ కార్యక్రమం ముగింపు కార్యక్రమం నగరంలోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కళల పట్ల అసక్తి ఉన్న సిఎం కేసిఆర్ కళాకారుల అభ్యున్నతికి పెద్దపీట వేశారని భవిష్యత్తులో కళాకారులందరికి మంచి రోజులు వస్తాయని మంత్రి అన్నారు. కళాకారులను తగు రీతిలో ప్రోత్సహించి తద్వారా కళాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. భావితరాలకు కళాసంపదను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కళలపై ఆధారపడి జీవించి ప్రస్తుతం జీవనాధారం లేక కోట్టుమిట్టాడుతున్న వృద్ధ కళాకారులకు ఒక్కొక్కరికి రూ.15వందలు చోప్పున పించన్లను అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 12వందల మంది కళాకారులకు పించన్లు అందజేశామని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా ఇన్సూరెన్స్, మెడికల్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర కళాకారులందరికి గుర్తింపు కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. తొలుత సాంస్కృతిక సారధి అధ్యక్షుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ జానపదాలు లేకుంటే మనమనుగడే లేదన్నారు. కళలు కాలక్షేపం కాదని, కళాకారులకు గౌరవంతో పాటు భృతి కూడా కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమన్నారు. ప్రపంచంలో జానపదా కళాకారులకు పండుగానే ఈ ఉత్సవ వేడుకలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఆసరా ఇస్తుందన్నారు. సాంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్వాగతం పలికారు. జానపద కళాకారులు నృత్య ప్రధర్శనలు చేశారు. వీటిలో కోమ్ముకోయ, లాంబాడి, జానపద గీతాలు, జానపద నృత్యాలు పలువురిని ఎంతాగానో అకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జానపద రంగంలో విశిష్ట సేవలు అందించిన కలాకారులు సమ్మయ్య, అంజయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, బక్కయ్యలను శాలువా, మెమొంటోలలతో మంత్రి ఘనంగా సన్మానించారు. పది జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ కళారూపాలను ప్రధర్శించి ఆహుతులను అలరించారు.