హైదరాబాద్

మహిళకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, సెప్టెంబర్ 2: అగ్రవర్ణాలతో పోలీసులు కుమ్మకై దళిత మహిళకు అన్యాయం చేస్తున్నారని, అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దళిత సంఘాల నాయకులు బూదాల అమర్ బాబు, మాలమహానాడు సెక్రెటరీ శ్రీనివాస్, విద్యార్ధి నాయకుడు బొదిగిలి శ్రీనివాస్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ దళిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని నగరంలో దళిత మహిళల పై అరాచకాలు జరుగుంటే, వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ధనిక, అగ్రవర్ణాల వారిని కాపాడేందుకు పని చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మర్రి పార్వతి భర్త సత్యనారాయణ మృతి చెందిన తరువాత తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో చౌల జంగీరెడ్డి,చౌలప్రభారెడ్డిల పై గత ఏప్రిల్ 17న ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వివరించారు. కాగా, బాలానగర్ ఏసిపి ఎన్.నర్సింహారెడ్డి నిందితులతో బేరసారాలు కుదుర్చుకుని , వారిని అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఇదేమిటీని ఏసిపిని ప్రశ్నిస్తే వీడియో సాక్ష్యాలు నా వద్ధ ఉన్నాయని, దర్యాప్తు ఎలా చేయాలో నాకు తెలుసునని, నా ఇష్టమొచ్చినట్లు చేస్తానని సమాధానమిచ్చినట్లు వారు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని లేని పక్షంలో బాలనగర్ ఏసిపి కార్యాలయం, కమిష్నరేట్‌ల ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు.
నాపై ఆసత్య ఆరోపణలు చేస్తున్నారు:
ఏసిపి నర్సింహరెడ్డి వివరణ
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన నిందితులను తాను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు పలువురు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమైన ఆరోపణలని ఏసిపి నర్సింహారెడ్డి కొట్టిపారేశారు. సంఘటనకు సంబంధించి డిసిపి, జాయింట్ సిపి వద్ద వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా వీరి మధ్య కుటుంబ గొడవల కారణంగా 2012లో పార్వతి భర్త సత్యనారాయణ మొదటి భార్య కొడుకు మర్రి ప్రభాకర్‌పై కూడా తనను కొట్టి బంగారు, నగదు లాక్కెళ్లినట్లు కేసు పెట్టారని ఏసిపి వివరించారు. బ్యాంకులో రుణాలు, లీజుదారులు కూడా పార్వతి పై కేసులు పెట్టారని ఆయన వివరించారు.