హైదరాబాద్

పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలో గంటసేపు దంచి వాన కొడితే చాలు రహదార్లన్నీ గోదారిని తలపిస్తాయి. వీధులు,సెల్లార్లు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఇటీవల నగరంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో గుణపాఠం నేర్చుకున్న అధికారులు పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు నగరం నీట మునిగే ప్రమాదమున్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిణామాల నుంచి నగరాన్ని రక్షించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు నాలాలకిరువైపులా వెలసిన ఆక్రమణలు తొలగించేందుకు నడుం భిగించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు కూల్చివేతలు చేపట్టేందుకు నియమించిన బృందాలు సోమవారం యుద్దాన్ని ప్రకటించారు. గతంలో కూడా ఇదే తరహాలో ఒకటి రెండురోజుల పాటు కూల్చివేతలంటూ అధికారులు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే! కానీ గతంలో ఆక్రమణలపై ధ్వంధ్వవైఖరిని ప్రదర్శిస్తూ రాజకీయనేతలు వీటి కూల్చివేతలను అడ్డుకునే వారు. ఇపుడు ఆ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను సమన్వయం చేసుకుని, వారి బందోబస్తుతో మరీ జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు.
ఆక్రమణలపై సర్కారు సీరియస్‌గా ఉండటంతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వీటి తొలగింపునకు సంబంధించి తీర్పులివ్వటంతో కూల్చివేతలకు ఎక్కడా కూడా వ్యతిరేకతలు ఏర్పడలేదు. సోమవారం వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు పనులను కమిషనర్ జనార్దన్ రెడ్డి నేరుగా వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కూల్చివేతల్లో భాగంగా సర్కిల్ 12లోని మదీనాగూడ రామకృష్ణానగర్‌లో నాలాపై ఎన్‌ఎస్‌కె బ్లిస్ మిడోస్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. అలాగే కాప్రా సర్కిల్‌లోని నల్లచెరువు నాలాపై మహాలక్ష్మీ ఎల్‌పిజి గ్యాస్ నిర్మించిన అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని స్వరూప్‌నగర్‌లోని నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగించారు. కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మించని ప్రహరీగోడలను అధికారులు నేలమట్టం చేశారు. సర్కిల్ ఎనిమిదిలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతాగేటు వద్దనున్న నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తుతో అధికారులు తొలగించారు.
హస్తినాపురం దేవకమ్మతోట సమీపంలోని నాలాపై ఆక్రణలను అధికారులు తొలగించారు. బంజారాహిల్స్‌లోని నాలాపై ఓ ఫంక్షన్ హాల్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేశారు.
39 ఆక్రమణలు..అక్రమ నిర్మాణాల కూల్చివేత
సోమవారం ఒక్కరోజే జిహెచ్‌ఎంసి అధికారులు నగరంలోని 24 సర్కిళ్లలో 39 ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇందులో భాగంగా నాలాలకిరువైపులా వెలసిన నిర్మాణాలు 8, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు 3, శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు 13, నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అదనంగా చేపట్టిన మరో 15 నిర్మాణాలతో కలిపి మొత్తం 39 కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.