హైదరాబాద్

శాంతియుత వాతావరణంలో మొహర్రంను జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మొహర్రంను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకు కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మొహర్రం సంతాపదినాలు, దసరా పండుగను పురస్కరించుకుని దక్షిణ మండలం పోలీసులు బుధవారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆషూర్‌ఖానాలకు చెందిన నిర్వహాకులు, ముతవలీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ పాల్గొని ఆషూర్‌ఖానా నిర్వహకులు, ముత్తవలీల సమస్యలు, వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొహర్రం సంతాపదినాలు ఆషూర్‌ఖానాల నిర్వహకులు, ముతవలీలు, ప్రజల సహకారంతో ముగిసెంత వరకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. మొహారం సంతాపదినాలకు ముందు బతుకమ్మ, దసరా ఉత్సవాలు సైతం జరుగనున్నందున ఇరు వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జంట పండుగలను నిర్వహించుకోవాలని కోరారు. ఆషూర్‌ఖానాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్ శాఖల సమన్వయంతో పని చేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో సూమారు 150 ఆషూర్‌ఖానాలు ఉన్నాయని వాటిలో కేవలం 80 ఆషూర్‌ఖానాలు పాతబస్తీలో ఉన్నాయని అన్నారు. పాతబస్తీలో ఉన్న ఆషూర్‌ఖానాల్లో 42 ప్రధాన ఆషూర్‌ఖానాలు ఉన్నాయని చెప్పారు. ఆషూర్‌ఖానాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొహర్రం సంతాపదినాలను పురస్కరించుకుని ఆషూర్‌ఖానాలకు కులమతాలకు అతీతంగా ప్రజలు వస్తుంటారని వారికి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా రెండు వేల మంది పోలీసులతో పాటు ఐదు వందల మంది షీటీమ్ పోలీసులు బందోబస్తుతలో పాల్గొంటారని కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న దక్షిణ మండలం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ, దసరా, మొహరం సంతాపదినాలను పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏనుగు అంబారీపై బీబీకాఆలం ఊరేగింపు మార్గాలలో రోడ్లను వేసి పారిశుద్ధ్య సమస్యలు తలేత్తకుండా అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ, అదనపు డిసిపి బాబురావు, ఎసిపిలు శ్రీనివాస్, అశోక్‌చక్రవర్తి, దక్షిణ మండలం పరిధిలోని అన్ని పోలీస్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లతో పాటు మతపెద్దలు అలీవుద్దీన్ ఆరీఫ్, వహీదుద్దీన్ జాఫ్రీ, హమీద్ జాఫ్రీ పాల్గొన్నారు.