హైదరాబాద్

హెచ్‌సియులో చల్లారని నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 20: దళితుడు పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో చెలరేగిన నిరసనలు యూనివర్సిటీలో ఇంకా చల్లారలేదు. రోహిత్ వేముల మృతికి నిరసన తెలియచేయడంతో పాటు బహిష్కరణకు గురైన విద్యార్థులకు మద్ధతు తెలిపేందుకు నేతలు వరుసకట్టారు. బహిష్కరణను ఉపసంహరించుకొనాలని విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. మూడోరోజు కూడా విద్యార్థులు క్లాసులు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వైస్‌చాన్సలర్‌ని తొలగించి కేంద్రమంత్రులు స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యా సంఘాలు వారి డిపార్టమెంట్ల నుండి ర్యాలీగా షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని విసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యూనివర్సిటీకి వచ్చి నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించి రోహిత్ వేములకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బహిష్కరణ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ కార్మిక శాఖ మంత్రి వత్తిడి బాగా కనపడుతోందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలను విద్యావ్యవస్థపై రుద్దాలని చూస్తున్నారని, అది మంచిదికాదని సీతారాం చెప్పారు. ఈ సంఘటనపై హైపవర్ కమిటీ వేసి విచారణ చేయాలని చెప్పిన ఆయన బహిష్కరణ విషయంపై రాష్టప్రతికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. తను విద్యార్థిగా ఉన్న సమయంలో యూనివర్సిటీలు చాలా బాగుండేవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌పై పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయడం జరిగిందని దాని ప్రకారం కేంద్రమంత్రులు విసిని కఠినంగా శిక్షించాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.నరేంద్రమోదీ విదేశీ యాత్రికుడిగా ఉన్నారని, ప్రధానిగా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించి అనంతరం మాట్లాడుతూ మనిషిని కులంతో అంచనా వేస్తున్నారని చనిపోయిన విద్యార్థిపై కులం పేరుతో వివాదం చేయడం అన్యాయమన్నారు. రాజకీయ నాయకుడిగా యూనివర్సిటీకి రావడానికి మనస్సు ఒప్పలేదని, విద్యార్థి చనిపోవడంతో స్పందించాల్సి వచ్చిందన్నారు. రాజకీయ నాయకుడిగా స్పందించకపోతే ఎలా అని రోహిత్ కుటుంబాన్ని ఓదార్చి దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతు ఉందని చెప్పడానికి వచ్చినట్లు జగన్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లుగడిచినా సాంఘిక బహిష్కరణ చేయడం చూస్తే మనం ఎక్కడ ఉన్నామో ఆలించాలన్నారు. 150 రూపాయలు రోజుకూలీ చేసుకుని రోహిత్ తల్లి అతనిని చదివించిందని చెప్పారు. ఎంతో కష్టపడి ఇంతవరకు చదివిస్తే చివరికి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్యతోపాటు విద్యార్థుల బహిష్కరణ విషయంలో రాజకీయ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో తండ్రిగా వ్యవహరించాల్సిన వైస్‌చాన్సలర్ రాజకీయాలకు తలొగ్గడం అన్యాయమన్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన విషయాన్ని వివాదం వైపు వెళ్లే విధంగా చేశారన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేసినట్లుందని జగన్ ఎద్దేవా చేశారు. శ్రీవాస్తవ గైడ్‌గా ఉన్న సమయంలో సింథిల్‌కుమార్, మెహంతిగైడ్‌గా ఉన్న సమయంలో రాజు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని విచారణ కమిటీ సభ్యులుగా వేయడం ఎంతవరకు న్యాయమన్నారు. 2002లో ఇదే విసి అప్పారావు చీఫ్ వార్డెన్‌గా ఉన్న సమయంలో 10 మంది ఎస్సీ విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారని జగన్ గుర్తు చేశారు. విద్యార్థి చనిపోయిన తరువాత ఎస్సీ, బీసీ అని వివాదం చేయడం అన్యాయమన్నారు. తమ పార్టీకి చెందిన 7 మంది ఎంపీలు పార్లమెంటులో ఈ విషయంపై పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు హనుమంతరావుతోపాటు మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజితోపాటు పలువురు పాల్గొన్నారు.
రాందాసుని అడ్డుకున్న విద్యార్థులు
మహారాష్టక్రు చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎంపి రాందాసు అత్వాల్‌ని విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించేందుకు రాందాసు వచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనకు అడ్డొచ్చి ఎన్‌డిఎ పార్టీకి మద్దతిస్తున్న మీరు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఎన్‌డిఎ మద్దతుదారులను దీక్షా శిబిరంలోకి అనుమతించేది లేదని పట్టుపట్టడంతోపాటు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంపి రాందాసుని వెనక్కి పంపించేశారు. దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు రాంచందర్ పాశ్వాన్‌తోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీలు విద్యార్థులను పరామర్శించి తమ మద్దతు ప్రకటించారు.