హైదరాబాద్

దీపావళి నుంచి 30 సర్కిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: జిహెచ్‌ఎంసి మహానగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌరసేవలందించటంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థారుూ సంఘం గురువారం మరోసారి భేటీ అయింది. మేయర్ బొంతురామ్మోహన్ అధ్యక్షతన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 22 అంశాలతో కూడిన అజెండాపై సుదర్ఘీమైన చర్చ జరిగిన తర్వాత మూడు మినహా మిగిలిన 19 అంశాలకు స్థారుూ సంఘం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమావేశం ప్రారంభం కాగానే మజ్లిస్ పార్టీకి చెందిన కొందరు స్థారుూ సంఘం సభ్యులు నగరంలోని రోడ్ల పరిస్థితిపైఅధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎక్కడబడితే అక్కడ రోడ్లన్నీ గుంతలమయంగా మారినా, మరమ్మతులు చేస్తున్నామంటూ అధికారులు వహిస్తున్న అలసత్వం వాహనదారుల పాలిట ప్రాణసంకటంగా మారుతోందని, వీలైనంత త్వరగా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సభ్యులు కోరారు. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభించిన మేయర్ ఇందులో మూడు మినహా మిగిలిన అంశాలను ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆమోదించిన అంశాలు
* జిహెచ్‌ఎంసి పరిధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ప్లే గ్రౌండ్స్, స్విమ్మింగ్‌పూల్స్ పే అండ్ ప్లే విధానం అమలును స్థారుూ సంఘం ఆమోదించింది.
* జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మించిన 40 మోడల్ మార్కెట్లలో దుకాణాల కేటాయింపునకు అనుసరించాల్సిన విధి విధానాలకు ఆమోదం
* జిహెచ్‌ఎంసి ఐటి విభాగంలో ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 28 మంది ఉద్యోగుల పారితోషకం పెంపుకు ప్రతిపాదనకు సానుకూల నిర్ణయం
* సికిందరాబాద్ బుద్ద్భవన్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సుకు కేటాయించిన నాలుగో అంతస్తు లీజును వచ్చే సంవత్సరం జూలై 18వరకు పొడిగిస్తూ నిర్ణయం
* రూ. 280 కోట్ల వ్యయంతో హశమాబాద్, అల్జుబేల్ కాలనీల గుండా ముర్కీ నాలాపై 3.45 మీటర్ల ఎత్తులో 250 మీటర్ల పొడువులో రీచ్-1 ఆర్‌సిసి రీటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆమోదం
* రూ. 2.85 కోట్ల వ్యయంతో హశమాబాద్, అల్జుబేల్‌కాలనీల గుండి వెళ్లే ముర్కీ నాలాపై 3.45 మీటర్ల ఎత్తులో 250 మీటర్ల పొడువులో రీచ్-2 ఆర్‌సిసి రీటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆమోదం
* రూ. 245 కోట్ల వ్యయంతో హశమాబాద్, అల్జుబేల్‌కాలనీల గుండా వెళ్లే ముర్కీ నాలాపై 3.45 మీటర్ల ఎత్తులో 250 మీటర్ల పొడువు రీచ్-3 ఆర్‌సిసి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సానుకూలంగా నిర్ణయం
* హశమాబాద్ హైటెన్షన్ టవర్ వద్ద ముర్కీ నాలాపై రూ. 2.95 కోట్ల వ్యయంతో బాక్స్‌డ్రెయిన్ నిర్మాణం ప్రతిపాదనలకు ఆమోదం
* తలాబ్‌కట్టా చోటేబ్రిడ్జి నుంచి షరీఫా మసీద్ వరకు ముర్కీనాలాపై రూ. 2.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్‌సిసి రీటైనింగ్ వాల్ ప్రతిపాదనలకు ఆమోదం
* సికిందరాబాద్ బైబిల్‌హౌజ్ సమీపంలోని ఆదయ్యనగర్ ప్లే గ్రౌండ్స్‌లో రూ. 2.42 కోట్ల వ్యయంతో నిర్మించే స్పోర్ట్స్ కాంప్లెక్సుకు ప్రతిపాదనకు ఆమోదం
* హబీబ్‌నగర్ నుంచి రియాసత్‌నగర్ జంక్షన్ వరకు 40 ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు అంగీకారం
* ఇబ్రహీంబాగ్ గ్రామశివారులోని తారామతి బారాధారి నుంచి జిహెచ్‌ఎంసి పరిధి వరకు 200 ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రతిపాదనకు మోక్షం
* జోరాబి దర్గా వద్ద 60 ఫీట్ల మేరకు జంక్షన్ అభివృద్ధి ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు తీర్మానం
* జిహెచ్‌ఎంసి పరిధిలోని ఏడు ప్రధాన పార్కుల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహణను సులభ్ సంస్థకు వచ్చే సంవత్సరం జూన్ 30వరకు అప్పగిస్తూ తీర్మానం
* గ్రీన్‌ల్యాండ్ జంక్షన్ నుంచి నెక్లెస్ వరకున్న రోడ్డును 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం
* పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం. 83 నుంచి గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణను 60 నుంచి 40 ఫీట్లకు తగిస్తూ ఆమోదం
* న్యాక్ రోడ్డు నుంచి కొత్తగూడ వరకు వంద ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు అంగీకారం
* దోమల్‌గూడలోని ఎస్‌బిహెచ్‌కాలనీలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ నిర్వాహణకు 689 చదరపు అడుగుల భూమిని లీజుపై కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనకు ఆమోదం
తిరస్కరించిన అంశాలు
* నాగోల్ వద్ద మూసీపై ప్రతిపాదిత స్కైవే నిర్మాణ ప్రాంతం వద్ద రేడియల్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన తిరస్కరణ
* చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్ నిర్వాహణకు గాను నీటి సదుపాయం కల్పించేందుకు రూ. 2.62 కోట్ల రూపాయలను జలమండలికి కేటాయించే ప్రతిపాదనను వచ్చే వారానికి వాయిదా.
* కొత్తపేట లక్ష్మీనగర్‌కాలనీలో ఓ ప్రార్థన మందిరానికి 225 చదరపు అడుగుల భూమిని కేటాయించే ప్రతిపాదనలపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం.