హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో విజయదశమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని గ్రేటర్ వాసులు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కాలక్రమేనా ఏ పండుగొచ్చినా, పబ్బమొచ్చినా నగరవాసుల్లో ఆధ్యాత్మిక పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇందుకు నగరంలోని ప్రధాన దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిక్కిరిసి దర్శనమివ్వటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇరువర్గాలకు చెందిన ప్రజలు పండుగలు ఈ మధ్య కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నపుడే బక్రీద్ రాగా, ఇపుడు నవరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు బుధవారం మొహరం పండుగ వచ్చింది. దీంతో గడిచిన నెలన్నర రోజులు మొత్తం భాగ్యనగరంలో పండుగల సందడి నెలకొంది. ఇందులో భాగంగా దసరా పండుగకు స్వస్థలాలకు తరలి వెళ్లిన నగరవాసులు తిరిగి సిటీకి చేరుకుంటున్నారు. దసరా సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం నిమిత్తం బుధవారం సాగర్‌కు తరలుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన మంగళవారమే విగ్రహాలను నిమజ్జనానికి తరలించాల్సి ఉండగా, ఆ రోజు పండుగ కారణంగా విగ్రహాలను బుధవారం నిమజ్జనానికి తరలిస్తున్నాయి. పాతబస్తీలో పేరుగాంచిన వివిధ అమ్మవారి ఆలయాలు, కాలనీ, యువజన, కుల సంఘాలతో పాటు పలు ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల నుంచి అమ్మవారి విగ్రహాల ఊరేగింపులు మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమై మరుసటి రోజైన బుధవారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ ఒక్కరోజే పాతబస్తీ నుంచి పదుల సంఖ్యలో భారీ ఊరేగింపులు సాగర్ వరకు వచ్చాయి. మరుసటి రోజైన బుధవారం మరోవర్గానికి చెందిన ప్రజల మొహరం పండుగ కావటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టస్కర్ వంటి భారీ వాహనాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి, అందులో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి వేలాది మందితో ఊరేగింపులను నిర్వహించారు. బుధవారం కూడా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి ఈ ఊరేగింపులు ఊపందుకున్నాయి. ఈ రకంగా వచ్చిన ఊరేగింపుల్లో కొన్ని ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలి వెళ్లేందుకు యత్నించగా, అక్కడ ఇటీవలే రోడ్డు కూరుకుపోవటంతో పోలీసులు విగ్రహాలను ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు.
భక్తిశ్రద్ధలతో మొహరం
ముస్లింలోని ఒక వర్గం ప్రజలు బుధవారం మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హసన్, హుస్సేన్‌లను స్మరిస్తూ వేలాది మందితో సాగిన ఊరేగింపులో పాతబస్తీలో ముస్లింలు రక్తాన్ని చిందించి మాతం సమర్పించారు. అంతేగాక, బీబీకా ఆలంలో పలువురు ప్రముఖులు దట్టీలను సమర్పించారు. మధ్యాహ్నం పీర్లను అంబారీపై ఊరేగించారు. ఈ సందర్భంగా పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని అహ్మద్‌నగర్, మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, మల్లేపల్లి, రెడ్‌హిల్స్ ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా షర్‌బత్‌లను పంపిణీ చేశారు.