హైదరాబాద్

చీటింగ్ కేసుల నమోదులో నిర్లక్ష్యం.. చర్యలకు రంగం సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: చీటింగ్ కేసుల నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా కేసులు పెండింగ్‌లో పడుతున్నాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. చీటింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎస్‌హెచ్‌వో, ఎస్సైలపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. చిట్‌ఫండ్స్..బ్యాంకు రుణాలు, సర్కారీ కొలువులు, వ్యాపారంలో భాగస్వామ్యం పేరిట అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెట్టే మోసగాళ్లు పెరిగిపోతున్నారు. పెళ్లిళ్లు, విదేశాల్లో ఉద్యోగాలు, ప్రైజ్ మనీ వంటి వాటితో ఎరవేసి..కోట్లు కొల్లగొడుతున్న మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసగాళ్ల బారిన పడిన బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. నిందితులు మాత్రం శిక్షలు లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
నిందితుల్లో ఏ కొద్ది మంది మాత్రమే జైలుకు వెళ్తున్నారు. బెయిల్‌పై వచ్చి మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారు. తాము పోగొట్టుకున్న సొమ్ము కొద్దిపాటైనా రికవరీ కాకపోయిందా..అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది పోలీసులు తమ ఫిర్యాదులను స్వీకరించడం లేదని, ఫిర్యాదులు చేసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. దీంతో మాయగాళ్లు మరింత రెచ్చిపోయే దుస్థితి నెలకొంది. అదేవిధంగా కొందరు విదేశీయులు ఆన్‌లైన్‌లో మోసాలతో బ్యాంక్ ఖాతాదారులకు టోకరా ఇస్తున్నారు. లక్షలు, కోట్లు గడిస్తూ దర్జాగా తిరుగుతున్న వైట్ కాలర్ నేరగాళ్లకు ముకుతాడు వేయాలన్నదే సిసిఎస్ అంతిమ లక్ష్యం. కాగా ఇప్పటి వరకు నాలుగు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సిసిఎస్ డిసిపిగా అవినాష్ మహంతి బాధ్యతలు చేపట్టాక గతంలో పనిచేసిన 14 మంది ఇన్‌స్పెక్టర్లకు దర్యాప్తునకు సహకరించాలని కోరుతూ చార్జి మొమోలు జారీ చేశారు. పాత కేసులను బయటకు తీసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను శిక్షించేందుకు న్యాయపరమైన వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఓ ఏసిపి స్థాయి అధికారిని కూడా నియమించారు. రోజు వారి కేసులు, సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు వంటి అంశాలపై ఆ అధికారి డిసిపితో చర్చించి, కోర్టులో ఉంచాల్సిన సాక్ష్యాలు, సాక్షులు, కేసు వాయిదా వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సిసిఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.