హైదరాబాద్

పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: బ్యాండు మేళాలు.. జిందాబాద్ నినాదాలతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓట్ల అభ్యర్థనలో బిజీగా ఉన్నారు. అధికార టిఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికివారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఒక్కసారి అవకాశమివ్వండి..ఈ సారైనా మాకు ఓటు వేయండి అంటూ ఓటర్లను మస్కా కొట్టేందుకు సరికొత్త ఆకర్షనీయమైన పద్దతులను అనుసరిస్తున్నారు. టీ కొట్టుకెళ్లి టీ చేస్తూ, పాన్ షాప్‌కు వెళ్లి పాన్‌లు కడుతూ, ఈస్ర్తి దుకాణానికి వెళ్లి బట్టలను ఈస్ర్తి చేస్తూ, చివరకు టిఫిన్ సెంటర్లకు వెళ్ల దోశాలు వేస్తూ మరీ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక టిఆర్‌ఎస్, టిడిపి, మజ్లిస్, బిజెపి వంటి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లలో అభ్యర్థులు ఇతర పార్టీలకు చెందిన వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక శివార్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం అదుర్స్ అనిపిస్తున్నారు. పాతబస్తీతో పాటు కోర్ సిటీ, శివార్లలోనూ గల్లీ గల్లీలో ప్రచారం సందడి నెలకొంది. ఉదయం ఏడు గంటల నుంచి పాదయాత్రలు, మధ్యాహ్నం ప్రచారంలోనే భాగంగా భోజనాలు, ఆ తర్వాత కార్యకర్తలతో మంతనాలు ముగించుకుని నాలుగు గంటల నుంచి మళ్లీ పాదయాత్రలు నిర్వహించి, రాత్రి పూట కార్యకర్తలతో ప్రచార వ్యూహంతో కోసం చర్చించటం వంటి రోజూ ప్రణాళికలతో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. టిఆర్‌ఎస్ ప్రచారంలో అన్ని పార్టీల కన్నా ముందుంటూ, ఈ నెల 30న సిఎం కెసిఆర్‌చే బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాల్లో తలమునకలైంది. మజ్లిస్ పోటీ చేస్తున్న 60 డివిజన్లలో పగటి పూట పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలను నిర్వహించి, రాత్రి ఏడు, ఎనిమిది గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహిస్తూ, నగరాభివృద్ధి, పలు సమస్యల పరిష్కారంలో తమవంతు కృషిని మజ్లిస్ అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. కోర్ సిటీలోని కొన్ని డివిజన్లలో అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థుల పరిస్థితి
అగమ్యగోచరంగా తయారైంది. మజ్లిస్ బలంగా ఉన్న డివిజన్లలో ఎలాగో మజ్లిస్ విజయం ఖాయమని భావించి, వివిధ పార్టీలకు చెందిన నేతలు వారికి సరెండర్ అయ్యేందుకు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. బిసి జనరల్ క్యాటగిరికి రిజర్వు చేసిన సీట్లలో ఎక్కువగా ఇలాంటి వ్యవహారం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన మూడు, నాలుగు పార్టీలకు చెందిన అభ్యర్థులు మైనార్టీర వర్గానికి చెందిన వారే కావటంతో ఓట్లు చీలీ బిజెపి, టిడిపి వంటి పార్టీలు గెలిచే అవకాశమున్నందున అభ్యర్థులంతా కలిసి ఒకరికి మద్దతిచ్చేందుకు రాజీ కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.