హైదరాబాద్

డ్రంకన్‌డ్రైవ్‌లో 6245 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఈ ఏడాది అక్టోబర్ 20 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6245 మందిపై కేసులు నమోదైనట్టు టాస్క్ఫోర్స్ అదనపు కమిషనర్ తెలిపారు. నగరంలోని ఎర్రమంజిల్ మూడు, నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వీరికి రూ.2.01కోట్లు జరిమానాతోపాటు జైలు శిక్షలు విధించారు. ముగ్గురికి 20 రోజులు, 161 మందికి 15 రోజుల చొప్పున శిక్ష విధించారు. 138 మందికి 10 రోజులు, 136 మందికి 7 రోజులు, 227 మందికి నాలుగు రోజులు, 136 మందికి 7 రోజులు, 33 మందికి ఆరు రోజులు, 227 మందికి నాలుగు రోజులు, 544 మందికి మూడు రోజులు, 1161 మందికి రెండు రోజులు, 582 మందికి రెండు రోజులు, 3071 మందికి సోషల్ సర్వీసులో భాగంగా ట్రాఫిక్ డ్యూటీ, కార్యాలయాల శుభ్రత వంటి శిక్ష విధించారు. ఈ డ్రైవ్‌లో 10065 ద్విచక్ర వాహనాలు, 983 త్రీవీలర్, 2115 ఫోర్ వీలర్, 284 ఇతర వాహనలు మొత్తం కలిపి 13447 వాహనాలు పట్టుబడ్డాయని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. 2011 నుంచి 2016 అక్టోబర్ వరకు వివిధ వాహనాలపై రూ.300 కోట్లు జరిమానా విధించి 210 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఇంకా ఆరు వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ. 90 కోట్ల బకాయిలు వసూలు కావలసి ఉందని టాస్క్ఫోర్స్ పేర్కొంది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మూడు సార్లు పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తామని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.