హైదరాబాద్

అంతులేని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: మహానగర పాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ స్థాయి అధికారి ఇంట్లో సోదాలు చేసినా కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయంటే జిహెచ్‌ఎంసిలో అవినీతి ఏ తరహాలో కొనసాగుతుందో అంచనా వేసుకోవచ్చు. జిహెచ్‌ఎంసిలో అవినీతిని రూపుమాపేందుకు ఎన్ని సంస్కరణలను తీసుకువచ్చినా వాటి అమలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా శుక్రవారం మరో బిల్ కలెక్టర్‌కు చెందిన మూడు ఇళ్లలో సుమారు మూడు కోట్ల విలువైన ఆస్తులు బయటపడటమే ఇందుకు నిదర్శనం. కొద్దిరోజుల క్రితం ఏడుగురు బిల్ కలెక్టర్లు లక్షలాది రూపాయలు వెచ్చించి శివారులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే! వారిపై కమిషనర్ ఏకంగా సస్పెన్షన్ వేటు వేసినా, సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం గమనార్హం. ఆ తర్వాత సికిందరాబాద్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కూడా లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన సంగతి తెలిసిందే! ఈ రకంగా వరుసగా జిహెచ్‌ఎంసి బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇంజనీర్లు వరుసగా ఏసిబికి పట్టుబడుతూ కార్పొరేషన్‌ను అప్రతిష్ట పాలు చేస్తున్నా, అవినీతిని అంతం చేయటంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఫలితంగానే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణతో మరో బిల్ కలెక్టర్ నర్సింహరెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) అధికారులు దాడులు నిర్వహించి, కోట్లాది రూపాయల ఆస్తులను గుర్తించారు. ఆయనకు చెందిన మూడు ఇళ్లపై అధికారులు మూడు బృందాలుగా ఏకకాలంలో దాడులు చేశారు. అయితే తొలుత ఆత్మహత్య చేసుకుంటాననంటూ బెదిరిస్తూ నర్సింహారెడ్డి ఏసిబి అధికారులను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అయినా అధికారులు తనిఖీలు కొనసాగించారు. జిహెచ్‌ఎంసిలో మధ్యవర్తులు, దళారీ వ్యవస్థలను రూపుమాపి అవినీతిని పూర్తి స్థాయిలో నివారించేందుకు పలు చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా, ఆచరణ సాధ్యం కాకపోవటం కూడా అక్రమార్కులకు ఓ వరంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు విధి నిర్వహణపై చూపాల్సిన శ్రద్ధను అక్రమార్జపై చూపటం వల్లే ఏసిబి దాడుల్లో అధికారులే నిర్ఘాంతపోయేలా కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడుతున్నాయి.