హైదరాబాద్

ప్రాణాలు మింగుతున్న రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: జంటనగర ప్రజలకు వౌలిక వసతులు, పౌరసేవలను అందించాల్సిన జిహెచ్‌ఎంసి బాధ్యతలను విస్మరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు రావల్సిన దుస్థితి. కొన్ని సందర్భాల్లో గుంతల్లో బైక్ అదుపు తప్పి పోడి ప్రాణాలు కోల్పోవటం, మరికొన్ని సందర్భాల్లో గుంతలు, దుమ్ము, దూళి కారణంగా వాహనదారులు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత నెల 21వ తేదీ నుంచి నగరంలో కురిసిన అతి భారీ వర్షాలకు రోడ్లన్నీ కొట్టుకుపోయిన పూర్తిగా గుంతలమయమైన సంగతి తెలిసిందే! ఈ రోడ్లకు రూ. 75 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నామంటూ, పనుల తనిఖీ అంటూ రాత్రింపగళ్లు అధికారులు చేసిన హడావుడి కేవలం ఆర్భాటానికే పరిమితమైందని చెప్పవచ్చు. గుంతలమయమైన రోడ్ల కారణంగా కొద్దిరోజుల క్రితం సికిందరాబాద్ ఓలిఫెంటా బ్రిడ్జి వద్ద ఓ మీడియా ప్రతినిధి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో యువకుడు గుంతల రోడ్లకు బలయ్యాడు. కూకట్‌పల్లి వై జంక్షన్ పరిధిలో ఉదయం బైక్‌పై అరుణ్‌కుమార్, సోమశేఖర్ అనే ఇద్దరు యువకులు ప్రయాణిస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఒక్కసారిగా రోడ్డుపై గుంత రావటంతో సడన్ బ్రేక్ వేయటంతో బైక్ జారీ పడింది. ఫలితంగా అరుణ్‌కుమార్ తలకు బలమైన గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో సికిందరాబాద్‌లో బైక్‌పై ప్రయాణిస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే! దీనిపై అప్పటి ముఖ్యమంత్రితో సహా మానవ హక్కుల సంఘం సైతం జిహెచ్‌ఎంసి అధికారులకు అక్షింతలు వేసినా, అధికారుల పనితీరులో మార్పు రాలేదు. రోడ్ల మరమ్మతుల విషయాన్ని ప్రస్తావిస్తే చాలు కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్లపై ప్రజలు ప్రాణాలు కోల్పోవల్సి వస్తోందని వాహనదారులంటున్నారు. కొద్దిరోజుల క్రితం సికిందరాబాద్ ఓలిఫెంటా బ్రిడ్జి వద్ధ మీడియా ప్రతినిధి ఒకరు గుంతలమయమైన రోడ్డుపై మృతి చెందినపుడు వౌనం వహించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఇపుడు కూకట్‌పల్లి వై జంక్షన్‌లో అరుణ్‌కుమార్ మృతి పట్ల ఆ రోడ్డు తమ పరిధిలోకి రాదని చెప్పుకొస్తున్నారు. జిహెచ్‌ఎంసి, జాతీయ రహదారులు, రోడ్లు భవనాల శాఖకు చెందిన వేలాది కిలోమీటర్ల పొడువున రోడ్లున్నాయి. అయితే ఇందులో ఏ రోడ్డు ఈ విభాగానికి చెందినదో ఆయా శాఖలకు పూర్తి స్థాయిలో స్పష్టత లేదు, మరమ్మతులు చేపట్టడంలో శాఖల మధ్య నెలకొన్న సమన్వయలోపం ప్రజల పాలిట శాపంగా మారుతోందని వాహనదారులంటున్నారు.