హైదరాబాద్

మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని రాజ్‌భవన్, సోమాజిగూడ, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా తదితర ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన మంచినీటి పైప్‌లైన్ పనులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 450 డయా వ్యాసార్ధం కలిగిన పైపులతో ఈ పనులను చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నగరంలో మంచినీటి, డ్రైనేజీ పైప్‌లపను సామర్ధ్యాలను పెంచుతున్నట్టు చెప్పారు. వందల ఏళ్ల నాడు నిర్మించిన డ్రైనేజీ, నీటి పైపులు పెరిగిన జనాభాకు సరిపడక పోవడంతో నిత్యం ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని సరిచేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందన్నారు. నగరంలో సైతం మిషన్ భగీరధ చేపట్టలని సిఎం కేసిఆర్ తలపెట్టారని అందుకు అనుగుణంగా పైపుల నిర్మాణం తదితర అంశాలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. అక్రమ మంచినీటి కనెక్షన్లు ఉన్న వారు వెంటనే వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31వరకు అక్రమ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసుకోక పోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలా ఆక్రమణల విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నామని, పేదలు నిర్మించిన చిన్నపాటి గృహాలను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపాలని నిర్ణయించామని తెలిపారు. భారీ భవంతులను మాత్రం దశలవారీగా తొలగించి వేస్తామని వివరించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి అధికారులు పాల్గొన్నారు.