హైదరాబాద్

సర్కిళ్లు పెంచినా తొలగని అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: జిహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతమున్న సర్కిళ్లను 30కి పెంచినా, ప్రజల్లో అయోమయం తొలగనేలేదు. సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్ నగరంలో నేటికీ ఏ ప్రాంతం ఏ సర్కిల్‌కు వస్తుందన్న అంశంపై ప్రజలకు అవగాహన అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. కేవలం ఏడు సర్కిళ్లకే పరిమితమైన కార్పొరేషన్‌ను పదేళ్ల క్రితం శివారులోని పనె్నండు మున్సిపాల్టీలను విలీనం చేసి సర్కిళ్ల సంఖ్యను 18కి పెంచగా, ఆ తర్వాత ఏడాదిన్నర క్రితం అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ పెద్దగా ఉన్న సర్కిళ్లను ఏ,బిలుగా విభజించి వీటి సంఖ్యను 24కు పెంచారు. ఈ సర్కిళ్లకు తగిన విధంగా సిబ్బంది లేకపోవటంతో ఇప్పటికే కొన్ని సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, టౌన్‌ప్లానింగ్ ఏసిపిలు ఇన్‌ఛార్జి బాధ్యతలతో కాలం గడుపుతున్నారు. అంతేగాక, ఒకే గదిలో ఒకే టబుల్‌కు అటు, ఇటు రెండు కుర్చీలు వేసుకుని రెండు సర్కిళ్ల అధికారులు బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఇపుడు మరో సారి పరిపాలన సౌలభ్యం కోసమంటూ వీటి సంఖ్యను 30కు పెంచారు. కానీ సర్కిళ్ల విభజన అనేది శాస్ర్తియంగా జరగలేదన్న విమర్శలు వస్తున్నాయి. సర్కిళ్ల సంఖ్యను ఏకంగా 30కి పెంచినా, పలు సర్కిళ్లకు ఏ,బిలుగానే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక సర్కిల్‌లో ఏ ప్రాంతం ‘ఏ’లోకి, ఏ ప్రాంతం బి లోకి వస్తుందన్న అయోమయం ప్రజల్లో ఇంకా పెరిగింది. అలా కాకుండా అధికారులు ఒకటి నుంచి 30వరకు సర్కిళ్లకు సంఖ్యలను, ప్రాంతాలను సూచిస్తే కొంత స్పష్టత ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, సర్కిళ్ల పెంపునకు సంబంధించి తొలుత ప్రజల అవగాహన కోసం నోటిఫికేషన్ లాంటిది జారీ చేస్తే కొంత వరకు ప్రజలకు సౌకర్యంగా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక, ఇదివరకు 24 సర్కిళ్లు ఉన్నపుడు ఏ,బిలుగా ఉన్న సర్కిళ్లలోనూ కొన్ని ప్రాంతాల్లో ఏ,బికి తోడు సి సర్కిల్‌ను కూడా ఏర్పాటు చేయటంతో ఇప్పటి వరకున్న అయోమయం మరింత పెరిగిందని చెప్పవచ్చు. అంతేగాక, ఒకే పాతబస్తీలోని సర్థార్‌మహాల్ లాంటి భవనాల్లో ఒకే గదిలో రెండు,మూడు సర్కిళ్లకు సంబంధించిన అధికారులు విధులు నిర్వర్తించటంతో ఏ ప్రాంతం ఎవరికొస్తుందన్నది కొంత అయోమయంగానే తయారైంది. అంతెందుకు ఇటీవల మేయర్, కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పారిశుద్ద్యంతో పాటు పలు పనులను తనిఖీ చేసినపడు ఆ ప్రాంతం ఏ డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్ల పరిధిలోకి వస్తుందన్న అంశంపై కాసేపు అయోమయం నెలకొన్న సందర్భాలు సైతం ఉన్నాయి.
ఇద్దరు అధికారులకు ఒక టేబుల్
గ్రేటర్‌లో ప్రస్తుతమున్న 24 సర్కిళ్లకు సంబంధించిన అధికారులు, సిబ్బందికే తగిన సౌకర్యాల్లేకపోగా, పైగా ఇపుడు 30 సర్కిళ్లుగా పెంచటంతో సరికొత్త ఇబ్బందులు తెరపైకి రానున్నాయి. ఇప్పటికే సర్దార్ మహాల్‌లో సర్కిల్ 4ఏ, 4బి, ఖైరతాబాద్‌లో సర్కిల్ 10ఏ, 10బిలకు సంబంధించిన అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లకు ఒకే టబుల్‌కు రెండు కుర్చీలు వేసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీలో ఒక సర్కిల్ ఏ,బి,సిగా మూడు ముక్కలు కావటంతో ఇపుడు మూడు సర్కిళ్లకు చెందిన అధికారులు సైతం ఒకే టేబుల్‌పై విధులు నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.