హైదరాబాద్

‘అద్దె’కు స్పందన అంతంతమాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: మహానగర పాలక సంస్థకు మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధికారులు కాస్త ముందుగానే కళ్లు తెరిచినా, వారు చేపట్టే చర్యలకు నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కటం లేదు. ప్రస్తుతం ఖజానా ఖాళీ అయ్యే స్థితిలో ఉన్న జిహెచ్‌ఎంసికి నిధులను సమీకరించటంలో భాగంగా ప్రస్తుతం జిహెచ్‌ఎంసికి చెందిన క్రీడామైదానాలు, స్టేడియంలను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని అధికారులు ఆరు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా, పరిపాలనపరమైన అన్ని అడ్డంకులను అధిగమించి ఈ నెల 1వ తేదీ నుంచి అద్దెకు ఇవ్వనున్న మైదానాలు, స్టేడియం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. గతంలో కూడా ఈ మైదానాలను ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలు పలు రకాల ఫంక్షన్లను నిర్వహించేందుకు వినియోగించేవారు. కానీ ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత ఆ స్పందన కూడా కరవైంది. పైగా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు పాఠశాలలకు కూడా వీటిని అద్దెకివ్వాలని అధికారులు భావించినా, ఇప్పటి వరకు స్కూళ్లు ఏమీ ముందుకు రాలేదు. కానీ కొందరు వ్యక్తులు, సంస్థలు నేరుగా బల్దియా క్రీడావిభాగానికి ఫోన్లు చేసి ఈ మైదానాలు, స్టేడియంలలో ఉన్న వౌలిక వసతుల కోసం ఆరా తీస్తున్నారు. వాటిలో చాలా వరకు మైదానాల్లో కనీస వసతుల్లేకపోవటంతో బుకింగ్ చేసుకునేందుకు జనం ఆసక్తి చూపటం లేదు. ముఖ్యంగా నగరంలో దాదాపు వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు పాఠశాలల్లో సగానికి పైగా స్కూళ్ల ఆట మైదానాల్లేవన్న విషయాన్ని గుర్తించి బల్దియా క్రీడామైదానాలను ఎక్కువగా స్కూళ్లు వినియోగిస్తాయని భావించారు. కేవలం స్కూళ్లే గాక, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ముందుకొచ్చినా, వాటిని అద్దెకిచ్చేందుకు జిహెచ్‌ఎంసి సిద్దంగా ఉన్నా, స్పందన కేవలం ఫోన్లు చేసి మాట్లాడటం వరకే పరిమితమైంది. ముఖ్యంగా స్టేడియంల మాట అలా ఉంచితే మైదానాల్లో కొన్నింటిల్లో మాత్రమే వౌలిక వసతులుండగా, మిగిలిన వాటిలో అసలు గతిలేవు. అంతేగాక, మరికొన్ని గ్రౌండ్లు, స్టేడియంలకు కనీసం ప్రహరీగోడలు కూడా లేకపోవటం, మరికొన్ని మైదానాల్లో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కొనసాగుతుండటం కూడా వీటిని బుక్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, ఇక జిహెచ్‌ఎంసికి చెందిన కొన్ని స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగ్గా ఉన్నా, అవి ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ఆధీనంలో లేవు. గతంలో లీజులకిచ్చినా, ప్రస్తుతం వాటికి సంబంధించి న్యాయపరమైన చిక్కులెన్నో ఉన్నాయి. సుదీర్ఘకాలంగా క్రీడామైదానాలు, స్టేడియంల నిర్వాహణపై సరైన శ్రద్ధ కనబర్చకపోవటం వల్లే నేడు అద్దెకు ఇస్తామన్నా, వినియోగించుకునేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్న విమర్శలున్నాయి. ఇక పాతబస్తీలోని కొన్ని మైదానాలు కేవలం జిహెచ్‌ఎంసికి చెందినవే అయినా, వాటిలో ఒక వర్గానికి చెందిన స్థానికులు, రాజకీయ నేతల పెత్తనమే ఎక్కువగా నడుస్తోంది. ఫలితంగా వీటిని అద్దెకు తీసుకుంటే ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతో ఎవరూ ముందుకు రావటం లేదని తెలుస్తోంది.