హైదరాబాద్

కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ప్రస్తుతం చెలామణి అవుతున్న రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనతో గ్రేటర్‌లో హడావుడి నెలకొంది. ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రభుత్వం గడువునిచ్చినా, బుధ,గురువారాల్లో రెండురోజుల పాటు ఏటిఎంలను మూసివేస్తున్నట్లు ప్రకటించటంతో ఖాతాదారులు తమ అవసరాలకు తగిన విధంగా వంద నోట్లను డ్రా చేసుకునేందుకు ఏటిఎంల వద్ద క్యూ కట్టారు. ముఖ్యంగా రూ. 500, వెయ్యి కరెన్సీ నోట్లపై నిషేధం విధించటంతో వెంటనే వాటిని ఏటిఎంల నుంచి తీసి మార్చుకునేందుకు ఖాతాదారులు ఎన్నో కష్టాల పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు చిన్నాచితక వ్యాపారం చేసే వారు సైతం బుధవారం ఏటిఎంల బాట పట్టారు. కొన్ని ఏటిఎంలలో రాత్రి తొమ్మిది గంటలకే క్యాష్ అయిపోయింది. మరికొన్ని ఏటిఎంలలో ఖాతాదారులు ఎలాగో వెయ్యి, రూ. 500 నోట్లు రద్దు చేయటంతో నాలుగు వందలు, తొమ్మిది వందలను డ్రా చేయటం కన్పించింది. కానీ చాలా ఏటిఎంలలో తొమ్మిది వందలు డ్రా చేస్తే 500ప్లస్ నాలుగు వందనోట్లు రావటంతో కొందరు ఖాతాదారులు నాలుక్కర్చుకున్నారు. మరికొందరు కొంత తెలివిగా వ్యవహరిస్తూ రానున్న రెండురోజుల పాటు అవసరాల కోసం నాలుగైదు సార్లు చొప్పున డ్రా చేస్తూ 16 నుంచి 20 వంద నోట్లను డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలో నగదును డిపాజిట్ చేసేందుకు ఏటిఎంలకు వచ్చిన ఖాతాదారులు తమవద్దనున్న 500, వెయ్యి నోట్లను వేసేందుకు యత్నించగా ఏటిఎం మిషన్లు స్వీకరించలేదు. ఈ క్రమంలో మరికొందరు నగర వాసులు తమ వద్దనున్న 500 నోట్లను విడిపించేందుకు పెట్రోలు బంకులు, మద్యం షాపులను ఆశ్రయించారు. కానీ కొన్ని పెట్రోలు బంక్‌లలో 500నోటును తీసుకుంటున్నా, ఆ మొత్తానికి పెట్రోలు పోసుకుంటేనే తీసుకుంటామన్న నిబంధనను విధించారు. అయితే కేంద్రం నిషేధించిన ఈ రెండు రకాల నోట్లను ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, రైల్వే, మెడికల్ షాపులు, విమాన కౌంటర్లు, ఆర్టీసి కౌంటర్లు, పాల్ బూత్‌లు స్వీకరించనున్నాయి. ఇదిలా ఉండగా, జేబులో నగదు లేకుండా కెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు జరిపే వారిపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మంకంగా తీసుకున్న ఈ కరెన్సీ నోట్ల రద్దు కారణంగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి.