హైదరాబాద్

పాత బస్తీలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: పాత బస్తీలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మక్కాలోని ‘కాబా’పై గుర్తుతెలియని కొందరు ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో వ్యంగ చిత్రాన్ని పెట్టినందుకు నిరశనగా పాత బస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మతాన్ని కించ పరచే విధంగా ఫేస్‌బుక్‌లో ఓ కార్టూన్‌ను పెట్టారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ జమాల్ బాగ్, రియాసత్‌నగర్‌కు చెందిన మీర్జా నరుూం బేగ్, సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం చార్మినార్, భవానినగర్, తలాబ్‌కట్టలో సుమారు వెయ్యి మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల దుకాణాలు మూయించారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏసిపి కార్యాలయం ఎదుటు ధర్నాకు దిగగా పోలీసులు నిరశనకారులను చెదరగొట్టారు. ఈ విషయమై సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు చేసిన ప్రచారమని, వదంతులు నమ్మవద్దని ఆందోళనకారులను సూచించారు. ఈ సందర్భంగా పాతబస్తీలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డిసిపి సత్యనారాయణ తెలిపారు. ఎవరూ, ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని, ఆకతాయిలు ఎవరైనా వదిలిపెట్టబోమని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.