హైదరాబాద్

సచివాలయం ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా, అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, నవంబర్ 21: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండు రోజుల్లో చెల్లించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు చిలుక మధుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. విద్యార్థుల ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికి వారి కళ్లను గప్పి మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయం గేట్ వద్దకు విద్యార్థులు చేరుకుని ఆందోళనకు పూనుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఆందోళన కారులను అరెస్టు చేసి గాంధీనగర్ పిఎస్‌కు తరలించారు. చిలుక మాట్లాడుతూ సిఎం రెండు రోజుల్లో ఫీజుల చెల్లింపుపై సృష్టమైన ప్రకటన చేయకపోతే 24న జరిగే కెసిఆర్ గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2090 కోట్ల మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉందన్నారు.
గత రెండు సంవత్సరాలుగా చెల్లింపులు నిలిపివేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. చదువులు పూర్తయిన వారికి కళాశాల యాజమాన్యాలు సర్ట్ఫికెట్‌లు ఇవ్వడం లేదని అయినా సిఎం ఈ విషయంపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి మాత్రం నిధులు లేవు సిఎం తన ఇల్లు నిర్మించడానికి, కార్లు మార్చుకోవడానికి, తన మూఢ నమ్మకాల కోసం వందల కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు చేయడానికి మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. సిఎం విద్యావ్యతిరేక విధానాలతో తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆరోపించారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు ఆందోళనలు నిర్వహించిన సమయంలో వారం రోజుల్లో విడుదల చేస్తామని సాక్షాత్తు సిఎం హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా నిధులు మాత్రం రాలేదని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని సిఎం పెడచెవిన పెడుతున్నారని, రాష్ట్రం మొత్తం సమస్యలతో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సతమతమవుతున్న తరుణంలో కోట్ల రూపాయలను వెచ్చించి కెసిఆర్ కొత్తగా కట్టుకున్న గడీలోకి ఈనెల 24న గృహప్రవేశం పెట్టుకున్నారని విమర్శించారు. రెండు రోజుల్లో విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై సిఎం స్పందించాలని లేకపోతే టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఆందోళనను చేపడుతామని చిలుక హెచ్చరించారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ప్రసాద్, రవీందర్, శరత్‌చంద్ర, సంతోష్‌నాయక్, శివకుమార్, కిశోర్ పాల్గొన్నారు.