హైదరాబాద్

రాజ్యాంగంపై చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కర్ని చైతన్యపర్చాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.ప్రశాంతి సూచించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తొలి సారిగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ క్రమంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లోని సిబ్బందిచే ఆమె కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ రాజ్యాంగానికి పరిచయ వాక్యాలుగా రాసిన వాటిల్లో సమానత్వం, సమన్యాయం, సోదరభావం, స్వాతంత్య్రం అనే నాలుగు అంశాలు ఎంతో ముఖ్యమైనవని వివరించారు. వాటి ఆధారంగా భారత పౌరుందరికీ సమాన హక్కులు ఉంటాయని తెలిపారు. ఈ ముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్కరు తెల్సుకోవాలన్న ఉద్దేశ్యంతోనే శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. భావితరాలకు ముఖ్యంగా విద్యార్థులకు ఆయా అంశాల ప్రాముఖ్యత తెలిపేందుకై జిల్లాలోని విద్యా సంస్థల్లో వ్యాసరచన, వ్యక్తృత్వ, పోటీలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాత ప్రతిపాదనకు కొత్త ఆమోదం

రూ.5 భోజనం అసలు ఖరీదు రూ. 24.64 ఒక్కో ప్లేటుపై రూ.2.39 పైసలు పెంపు
ఏడాది నుంచి ‘పెంపు’ప్రతిపాదన గోప్యం అప్పటి నుంచి వర్తింపజేస్తూ ‘స్థారుూ’ఆమోదం?
అసలే సంక్షోభం..ఆపై అదనపు భారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 26: మహానగరంలో అర్దాకలితో అలమటించే వారికి ఒక్క పూటనైనా భోజనం పెట్టాలన్న సంకల్పంతో జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న రూ. 5 భోజన పథకంతో అధికారులు సేవా ముసుగులో నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణ వెల్లువెత్తుతోంది. ఈ పథకానికి సంబంధించి భోజనం ధర పెరిగినా, ఆ విషయాన్ని గోప్యంగా పెట్టిన అధికారులు ఈ నెల 22న జరిగిన స్థారుూ సంఘం ముందు పెట్టి ఆమోదం తీసుకోవటం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలుత అయిదు కేంద్రాలతో ప్రారంభించిన ఈ రూ. 5 భోజనం స్కీం ఇపుడు ప్రతిరోజు మధ్యాహ్నం నగరంలోని 50 కేంద్రాల్లో సుమారు 13వేల మందికి రూ. 5కే భోజనాన్ని సరఫరా చేస్తోంది. ఆకలితో అలమటించే వారికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పం మంచిదేనని, కానీ ఒక్కో ప్లేటు జిహెచ్‌ఎంసి వెచ్చిస్తున్న ఖర్చు కన్నా తక్కువలో అంటే దాదాపు రూ. 15 నుంచి రూ. 20లోనే ఇరానీ హోటళ్లలో భోజనం లభ్యమవుతోంది. అంతేగాక, కుర్చీల్లో కూర్చోని తినేందుకు వీలుగా హోటల్ యజమాన్యాలు ఏర్పాట్లు కల్పిస్తున్నారు. కానీ ఇంతకన్నా ఎక్కువ ఖర్చును జిహెచ్‌ఎంసి భరిస్తున్నా, రోడ్లపైనే తినాల్సిన పరిస్థితులున్నాయి. వేల కోట్ల బడ్జెట్‌తో వంద కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టే బల్దియా ఆకలితో ఉన్న వారికి ఈ మాత్రం సేవ చేస్తే బాగానే ఉంటుందని, కానీ గత సంవత్సరం అక్టోబర్ మాసంలో ఒక్కో ప్లేటు భోజనంపై అదనంగా పెంచిన రెండు రూపాయల 39పైసలు పంచే ప్రతిపాదనకు ఇపుడెందుకు స్థారుూ సంఘం మంజూరీ తీసుకోవాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది. గత ఫిబ్రవరి మాసంలోనే పాలక మండలి అందుబాటులోకి వచ్చినా, అప్పటి నుంచి ఈ ప్రతిపాదనకు అధికారులు స్థారుూ సంఘం ముందుకు గానీ, కౌన్సిల్ ముందుకు గానీ తేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరంలో సామాన్య ప్రజలకు రూ. 5కే మరింత నాణ్యతతో కూడిన భోజనాన్ని జిహెచ్‌ఎంసి అందుబాటులోకి తెచ్చిందని భావిస్తున్నా, ఒక్కో ప్లేటు భోజనానికి జిహెచ్‌ఎంసి గత రెండేళ్లుగా 22 రూపాయల 25 పైసలు ఖర్చవుతోంది. ఇందులో లబ్దిదారుడు కేవలం రూ. 5 చెల్లించగా, మిగిలిన 17 రూపాయల 25 పైసలను గతంలో జిహెచ్‌ఎంసి, హెచ్‌కెఏం చారిటబుల్ ఫౌండేషన్ సంస్థలు వివిధ రూపాల్లో భరిస్తూ వచ్చింది. కానీ గతంలో ఈ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినపుడు 22 రూపాయల 25 పైసలకు ఒక్కో ప్లేటు చొప్పున డెలవరీ ఇచ్చిన ఫౌండేషన్ గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి అదనంగా రూ. రెండున్నరను పెంచింది. అయితే ధరను పెంచినపుడు వౌనం వహించిన అధికారులు ఈ నెల 22న జరిగిన స్థారుూ సంఘం సమావేశంలో 22రూపాయల 25 పైసలకు అందుబాటులోకి వచ్చే లబ్దిదారుడు రూ. 5 చెల్లించగా, గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లేటుకు రెండు రూపాయల 39పైసలు పెంచటంతో బల్దియాపై రోజుకి రూ. 31వేల పై చిలుకు అదనంగా భారం పడుతోంది. ఈ లెక్కన చూస్తే నగరంలో రూ. 15 నుంచి రూ. 20లోపు లభ్యమయ్యే ప్లేటు పప్పన్నమే గిట్టుబాటుగా ఉంటుందన్న విమర్శలున్నాయి.