హైదరాబాద్

రాబోతుంది ‘నుమాయిష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: ‘నుమాయిష్’ అనగానే పిల్లలే కాదు పెద్దలూ కేరింతలు కొడతారు, ఎగిరి గంతేస్తారు. వచ్చేస్తోంది ‘నుమాయిష్’. ఇంకా కొన్ని రోజులే. కానీ, పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ అంతా చిన్నాభిన్నం అయినందున, నుమాయిష్‌పైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వర్తక, వాణిజ్య వ్యాపారుల్లో మొదలైంది. ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరున నగరంలోని నాంపల్లిలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ ‘నుమాయిష్’కు సందర్శకుల తాకిడి మాములుగా ఉండదు. వేల సంఖ్యలో తరలి వస్తారు. లోపల ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతుంది. పండుగ సెలవులు, శని, ఆదివారాల్లో లోపల నడిచేందుకు కూడా స్థలం ఉండనంతగా క్రిక్కిరిసిపోతుంది. వర్తక, వాణిజ్య వ్యాపారులు, తినుబండారాల వ్యాపారులు ఎగ్జిబిషన్ ప్రారంభానికి కనీసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఎగ్జిబిషన్ సొసైటీ తమకు కేటాయించిన స్టాల్స్ (దుకాణాలు) అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు. స్టాల్స్ కోసం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులపై రాజకీయ నాయకుల వత్తిళ్ళు కూడా ఉంటాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నందున నుమాయిష్‌పైనా ప్రభావం పడుతుందేమోనని స్టాల్స్ యజమానులు భయపడుతున్నారు.