హైదరాబాద్

టిఆర్‌ఎస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: డిప్యూటీ సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జనవరి 30: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలని డిప్యూటీ సిఎం మహ్మద్ మహమూద్ అలీ పాతబస్తీ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాంద్రాయణగుట్ట డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్, బార్కాస్ అభ్యర్థి సరితలకు బార్కాస్‌లో శనివారం మధ్యాహ్నం ఎన్నికల ప్రచార సమావేశంలో మట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలను టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు సమానమేనని పేర్కొంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలును చూసి ప్రతి ఒక్కరు ముగ్దులై స్వచ్చందంగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. అభివృద్ధి పనులను చూసి మద్దతు పలకాలని రాజేందర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం డివిజన్‌లోని వివిధ బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రచారం చేశారు. పాదయాత్రలో పి.చంద్రశేఖర్, ఎం.నారాయణ్‌రెడ్డి, అన్సారి, ఫరీద్, శ్రీకాంత్, వెంకన్న, సలీముద్దీన్, ఖయుం ఖురీషీ, భీంరావు, శ్రీనివాస్‌గౌడ్, పాల్గొన్నారు.