హైదరాబాద్

కార్యకర్తలకు చిక్కులు తెచ్చిపెడుతున్న వాట్సప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 30: క్షణాల్లో సమాచారాన్ని చేరవేసేందుకు ఆయుధంగా ఉపయోగపడుతున్న వాట్సాప్ గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలకు, సంఘాలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కార్యకర్తలకు, బస్తీనాయకులకు, వివిధ సంఘాలకు పండుగలాంటిది. తమవద్ద ఇంత మంది జనాలు ఉన్నారు... అంటూ అభ్యర్ధుల చెంతకు వెళ్లి, తమ సంఘం మద్దత్తు మీకే నంటూ బేరసారాలు జరుపుకొని పబ్బం గడుపుకునే వారికి అభివృద్ధి చెందిన సాంకేతికత ఆ అవకాశాలను దూరం చేస్తోంది. ఒక రోజు ఓ పార్టీ అభ్యర్ధిని కలిసి చాటుమాటుగా మరుసటి రోజు మరో పార్టీ అభ్యర్ది వద్దకు వెళ్లి గతంలో లబ్దిపొందిన వారికి ఈసారి అలాంటి అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధులు వాట్సాప్‌ను అద్బుతంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక్కసారి తమ వద్దకు వచ్చిన వారిని ఫొటోలు తీసి, వాట్సాప్‌లో పెట్టడంతో ఇతర పార్టీల వారు అలర్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఓ సారి తమతో కమిట్ అయిన వారు ఇతర పార్టీల వెంట తిరుగుతున్న ఫొటోలను సంపాదించి, సదరు వ్యక్తులను, సంఘాలను పిలిచి చీవాట్లు పెడుతున్నారు. దీంతో రహస్యంగా వెళ్లి కలిసే అవకాశం కోల్పొయి నానా తంటాలు పడుతూ వాట్సాప్‌ను కనుక్కున్నడెవడంటూ తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణలో ప్రత్యామ్నాయ
రాజకీయ శక్తి అవసరం
- మాజీ స్పీకర్ పి.ఏ.సంగ్మా -
ఖైరతాబాద్, జనవరి 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని మాజీ స్పీకర్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎంపి పి.ఎ సంగ్మా అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణాలో పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన ఎంతోమందిపై ఇప్పటికీ కేసులు ఉన్నాయని, వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
ఉద్యమ కారులకు తగిన గుర్తింపు రావడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు విఫలవౌతున్నాయని చెప్పారు. వీటన్నింటిని నేపధ్యంలో ఇక్కడి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించే ఒక వేదిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

పెరేడ్ గ్రౌండ్ గులాబీమయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సికిందరాబాద్, బేగంపేట, జనవరి 30: పెరేడ్ గ్రౌండ్ గులాబీ మయమైంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కేసిఆర్ ఎన్నికల సభకు జనం పోటెత్తారు. వివిధ నేతల ప్రసంగాలు ఉత్తేజపరిచాయ. తెలంగాణ ఉద్యమ రథసారధి, స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌తోనే హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, విశ్వనగరంగా ఎదిగి తీరుతుందని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, నగర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సికిందరాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ కన్నా ముందు డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై సమానమైన శ్రద్ధ చూపుతూ ఏ రాష్ట్రంలో లేని పాలన తెలంగాణలో కొనసాగుతోందన్నారు. అనంతరం మంత్రి నాయిని మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపి, కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. నగరంలోని తెలంగాణేతరులు సైతం టిఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారని వివరించారు. కెసిఆర్ విజన్ విశ్వనగరమంటే, మురికివాడల్లేని నగరమని, ఇది సాధించేందుకు జిహెచ్‌ఎంసిలో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏకకాలంలో ముందుకు తీసుకెళ్తున్న ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల నగరంలో ప్రచారం చేస్తూ నగరాన్ని తానెంతో అభివృద్థి చేశానని చెప్పుకుంటున్నాడని, అధికారంలో ఉన్నపుడు ఆయన కొద్దో గొప్పో చేయోచ్చునని, ఇపుడు కెసిఆర్ అధికారంలో ఉండగా, ఆయన అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన నాయకుడు సైతం టిఆర్‌ఎస్‌ను విమర్శించటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కెటిఆర్ నగరంలో పర్యటిస్తుంటే వస్తున్న స్పందనను చూసి ప్రతి పక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తలసాని పేర్కొన్నారు. ్ర
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
టిఆర్‌ఎస్ బహిరంగ సభ నేపధ్యంలో దాదాపు నాలుగు గంటల సేపు రసమయి బృందం నిర్వహించిన తెలంగాణ ధూంధాం ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పథకాలనువివరిస్తూ మధ్యలో రసమయి మాట ఆటపాటలకు సభికులను నుంచి మంచి స్పందన వచ్చింది. సాంస్కృతిక వేదిక ముందు కూర్చున్న మహిళలు తెలంగాణ పాటలకు లయబద్దంగా నృత్యాలు చేయడం పలువురిని ఆకర్షించింది.