హైదరాబాద్

ముగ్గురి ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 30: భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. క్షణికావేశంలో భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోగా..ఆమెను కాపాడబోయిన భర్త కూడా మంటల్లో కాలిపోయాడు. ఈ సంఘటనలో ఓ చిన్నారి సైతం గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయవిదారక సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మిగూడకు చెందిన బాబుగౌడ్ కుమారుడు ఎలక కృష్ణగౌడ్(34)కు ఎనిమిది సంవత్సరాల క్రితం షాద్‌నగర్ ఈదులపల్లికి చెందిన సరిత(27)తో వివాహమైంది. వీరికి హర్షిత (5), ఐశ్వర్య (2), అశ్విన్ (ఏడాదిన్నర) సంతానం. భార్యాభర్తల మధ్య గత కొన్నాళ్లుగా తగాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణగౌడ్ తెదేపాలో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చిన కృష్ణగౌడ్ భార్య సరితతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగడంతో గొడవ పెద్దదైంది. దీంతో సరిత కోపోద్రిక్తురాలై క్షణికావేశంలో వంటింట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన భర్త వెంటనే అప్రమత్తమై భార్యను కాపాడడానికి మంటలార్పుతుండగా మంటల్లో ఉన్న భార్య భర్తను ఆలింగనం చేసుకుంది. దీంతో ఇద్దరికీ మంటలు అంటుకొన్నాయి. ఆ సమయంలో కుమారుడు అశ్విన్ కూడా వారిని పట్టుకోవడంతో అశ్విన్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలు కృష్ణగౌడ్, సరిత అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన చిన్నారి అశ్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదేవిధంగా ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులైన అక్షిత, ఐశ్వర్యలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
కలహాలతో మృతిచెందిన కృష్ణగౌడ్, సరితల కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా పార్టీ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయం, పిల్లలకు ఎన్టీ ఆర్ ట్రస్ట్ విద్యాలయంలో ఉచిత విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. ఇద్దరు పిల్లలపై ఒక్కొక్కరికీ రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్, నెల పోషకానికి కావాల్సిన ఖర్చులను అందజేస్తామని హామీ ఇచ్చారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సానెం శ్రీనివాస్‌గౌడ్ కృష్ణగౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి దహన సంస్కారాల కోసం రూ.5 వేలను అందజేశారు. అదేవిధంగా తన పిల్లల పేరుపై ఉన్న ట్రస్ట్ నుంచి పిల్లలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటానని భరోసా కల్పించారు.