హైదరాబాద్

పోలింగ్ బూత్‌ల్లో వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా రెండో తేదీన జరగనున్న పోలింగ్‌లో ఎక్కువమంది ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సౌకర్యార్ధం వౌలిక వసతులను ఏర్పాటు చేసినట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన విలేఖరులతో కలిసి నగరంలోని మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, గచ్చిబౌలిలోని స్టేడియంలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నగరంలోని సుమారు 70లక్షల పైచిలుకు ఉన్న ఓటర్ల కోసం 7757 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన జనవరి 8వరకు ఓటరు జాబితా సవరణకు అవకాశమివ్వటంతో మొత్తం ఓటర్ల సంఖ్య 74లక్షల 23వేల 980కు పెరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను కూడా 7802కు పెంచినట్లు తెలిపారు. అంతేగాక, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ బూత్‌లో 1280 కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత 2009 మున్సిపల్ ఎన్నికల్లో 42.92 శాతం ఓట్లు నమోదయ్యాయని, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన వివరించారు. ఇందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్‌ల డౌన్‌లోడ్ వెసులుబాటు కల్పించటంతో పాటు ఓటు విలువ, ప్రాధాన్యత తెలియజేసేందుకు జిహెచ్‌ఎంసికి చెందిన 1500 సెల్‌ఫోన్లలో ప్రత్యేక రింగ్ టోన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాక, వృద్థులు, వికలాంగులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వీల్‌చైర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా ర్యాంప్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక అంధులు ఓటు వేసేందుకు వీలుగా వారితో వారి కుటుంబ సభ్యులను ఒకర్ని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల సంఘం, పోలీసు శాఖతో కలిసి సమష్టి ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన వివరించారు. సమస్యాత్మకమైన 3వేల ప్రాంతాల్లో పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ష్..గప్‌చుప్
ముగిసిన ప్రచారం
మొదలైన బేరసారాలు
అభ్యర్థుల సమీకరణలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 31: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం అయిదు గంటలతో ముగిసింది. చివరి రోజు కావటంతో దాదాపు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిరాటంకంగా నాన్‌స్టాప్ పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలిశారు. తమకు ఓటువేసి గెలిపించాలని పోటీపడీ మరీ అభ్యర్థులు అభ్యర్థించారు. ప్రచారం ముగియటంతో ఇక పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని డివిజన్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. డివిజన్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, అభ్యర్థి బలాబలాలను బట్టి అభ్యర్థులను కొనేందుకు బేరం ఆడుతున్నారు. ఒకే వర్గం, ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు, ఒకే పార్టీ నుంచి టికెట్ ఆశించి ఒకరు అభ్యర్థి, మరొకరు రెబల్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. అభ్యర్థుల పరిధిలో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి వారికి రేటు కడుతున్నారు. అలాగే పాతబస్తీలోని మరికొన్ని డివిజన్లలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య అసలు పోటీ ఉందన్న విషయాన్ని గ్రహించిన ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు వారంతట వారే ఇతర పార్టీలకు సరెండర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకమైన వ్యవహారంలో పాతబస్తీలో ఎక్కువ మంది టిడిపి, బిజెపిలకు చెందిన నేతలున్నారు. ఇక కోర్ సిటీలో కూడా నలుగురు, ఆరుగురు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులున్న డివిజన్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రం ఇతర పార్టీల అభ్యర్థుల నుంచి తక్కువలో తక్కువ రూ. పది లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బేరం కుదుర్చుకుని పోటీలో వౌనంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. పోలింగ్ జరగనున్న ఫిబ్రవరి 2న పోలింగ్‌కు దూరంగా ఉండటం, ఇప్పటివరకు అభ్యర్థికున్న క్యాడర్ మొత్తాన్ని రహస్యంగా ఇతర పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసి ఓట్లు వేయించటం వంటివి బేరంలో ప్రధానంశాలుగా ఉన్నాయి. మజ్లిస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో మరోవర్గానికి చెందిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇదే రకంగా తయారైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఖర్చు చేసినా మజ్లిసే గెలిచే అవకాశాలుండటంతో పలు డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీ అయిన మజ్లిస్‌కు సరెండర్ అయినట్లు సమాచారం. మరి ఇప్పటివరకు ఎందుకు ప్రచారం చేశారంటే అది తమ వ్యక్తిగత ప్రచారం కోసమేనని, ప్రత్యర్థులు తమను గుర్తించేందుకేనని అభ్యర్థులు బాహాటంగానే చెబుతున్నారు.