హైదరాబాద్

ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షిస్తూ, విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 31 వసంతాల్ని సగర్వంగా పూర్తి చేసుకుందని, తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, కళలను పరిపుష్టం చేయడానికి ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుందని వైస్ చాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. భాషా సాహిత్యాలు, నాటకం, సంగీతం, నృత్యం, జానపదం ఇలా వివిధ రంగాల్లో కృషి చేసేవారిని ప్రోత్సహించడానికి వర్సిటీ ప్రతియేటా పురస్కారాలను అందజేసి సత్కరిస్తుంది. ఆ కోవలోనే విశ్వవిద్యాలయం 2015-ప్రతిభా పురస్కారాలను నిష్ణాతులైన వారిని కమిటీ ఎంపికచేసి వివరాలు వెల్లడించారు. కవిత- డా. అఫ్సర్, విమర్శ- డా. ఆర్.శ్రీవెంకటేశ్వరరావు, చిత్రలేఖనం-డిఎల్‌ఎన్ రెడ్డి, శిల్పం- చింతల జగదీష్, నృత్యం- భీమన్, సంగీతం- డా. ఎల్లా వెంకటేశ్వరరావు, పత్రికారంగం- డా.కె.శ్రీనివాస్, నాటకరంగం-తడకమళ్ల రామచందర్, జానపద- మారోజు అప్పయ్య, అవధానం- డా. అయాచితం నటేశ్వరశర్మ, ఉత్తమ రచయిత్రి-నెల్లుట్ల రమాదేవి, నవల/కథ- పి.చంద్ (ఉరుగొండ యాదగిరి). పురస్కార గ్రహీతలకు విశ్వవిద్యాలయం రూ.20116 నగదు, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరిస్తుందని తెలిపారు.