హైదరాబాద్

30 రోజులు.. ముప్పుతిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని నెలరోజులు గడుస్తున్నా, సామాన్యుల కష్టాలు తొలగనేలేదు. గడిచిన ముప్పై రోజుల్లో నగరంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, నగదు కొరత కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. గత నెల 8వ తేదీన వెయ్యి, 500 నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల పాటు ప్రజలకు నగదు విత్‌డ్రా, చిల్లర కోసం కష్టాలు తప్పవని ప్రకటించినా, నెలరోజులు గడుస్తున్నా, వినియోగదారులు, ఖాతాదారులకు కష్టాలు రెట్టింపయ్యాయే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదపు. ముఖ్యంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో జీతాలు జమ అవుతున్న వేతన జీవుల అవస్థలు వర్ణణాతీతం. ఇక కొందరు ప్రైవేటు ఉద్యోగులైతే నగదు కోసం ఏటిఎం వద్ద క్యూలో నిల్చుండా? లేక ఉద్యోగానికి వెళ్లాలా? అంటూ తీవ్ర స్థాయిలో అసహహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దు చేసిన వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిన వెంటనే జమ అయిన నగదుకు తగిన విధంగా కొత్త కరెన్సీ నోట్లు, వంద, యాభై నోట్లు అందుబాటులో లేకపోవటంతో చిల్లర సమస్య తీవ్రరూం దాల్చింది. ఇక ఏటిఎం సెంటర్లు అంతంతమాత్రంగా పనిచేస్తుండటంతో వాటిలో పెడుతున్న నగదు కేవలం గంట సమయంలో అయిపోతోంది. సరే ఇతర ప్రాంతాల్లోని ఏటిఎంలను ఆశ్రయించగా, తనవంతు వచ్చే సరికి నగదు అయిపోతోంది. ఈ రకంగా నగరవాసులు గడిచిన 30రోజులుగా నగదు వేటను కొనసాగిస్తున్నారు. చాలా ఏటిఎంలలో కేవలం రూ. 2వేల కరెన్సీ నోటును మాత్రమే అందుబాటులో ఉంచటం ప్రజల కష్టాలు రెట్టిపయ్యాయి. సరే 1వ తేదీ జీతం వచ్చిన తర్వాతానైనా ఇంటి అవసరాల కోసం మొత్తం తీసుకునేందుకు బ్యాంకులకు వచ్చే ఉద్యోగులకు నగదు అందుబాటులో ఉండటం లేదు. ఒక్కో బ్యాంకు ప్రతిరోజు కేవలం రూ. 4లక్షల నుంచి రూ. 5లక్షల వరకు మాత్రమే నగదు విత్‌డ్రాలకు సంబంధించి టోకెన్లు జారీ చేయటం, మిగిలిన వారిని మళ్లీ రమ్మని సూచించటంతో ఖాతాదారులు బేజారవుతున్నారు. అంతేగాక, పెద్దనోట్లు రద్దయిన నాటి నుంచి నగరంలోని సుమారు ఆరున్నర వేల పై చిలుకున్న ఏటిఎంలలో ప్రస్తుతం కేవలం ఇరవై నుంచి ఇరవై అయిదు శాతం ఏటిఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిల్లో కూడా డబ్బు ఎపుడు అందుబాటులో ఉంటుందో? తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ అందుబాటులో ఉన్నా అది కేవలం రూ. 2వేల కొత్త నోటే కావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఇంకా ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎలాగో జీతం వచ్చింది కదా!కుటుంబ అవసరాలకు తగిన విధంగా నగదు తీసుకునేందుకు వెళ్తున్న వారికి బ్యాంకు అధికారులు చెక్ పెడుతున్నారు. నగదు కొరత ఉండటంతో నగరంలోని కొన్ని బ్యాంకులు ఒక్కో ఖాతాదారుడికి రూ. 10 వేలు, మరికొన్ని బ్యాంకులు ఒక్కోక్కరికి రూ. 4 వేలు మాత్రమే ఇవ్వటంతో ఖాతాదారుల అవసరాలు తీరటం లేదు. ఫలితంగా ఏటిఎం కార్డుల్లేని ఖాతాదారులు బ్లాంక్ చెక్కులు తీసుకుని బ్యాంకు ముందు క్యూలో నిల్చుంటున్నారు. బ్యాంకు అధికారులెంత ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారో అడిగి తెల్సుకుని అంతే నగదు రాసుకుని డ్రా చేసుకోవల్సి వస్తోంది.
పెరగనున్న ఆన్‌లైన్ లావాదేవీలు
పెద్దనోట్ల రద్దు అనంతరం చోటుచేసుకున్న నగదు కొరత, చిల్లర సమస్యలు, నగదు రహిత సేవలను ప్రోత్సహించేందుకు కేంద్రం డెబిట్ కార్డులపై రూ. 2వేల లావాదేవీకి సంబంధించి సర్వీసు ఛార్జీలను మినహాయించటం, మరికొన్ని నజరానాలను కేంద్రం ప్రకటించటంతో ఇకపై ఆన్‌లైన్ లావాదేవీలు జరగనున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక్కో ఆన్‌లైన్ లావాదేవీకి సంబంధించి కొన్ని బ్యాంకులు 0.5శాతం, మరికొన్ని 2శాతం వరకు కూడా సర్వీసు ఛార్జీలను వసూలు చేసేవి. ఇపుడు కార్డు దారుడికి ఈ భారం తగ్గటంతో చిల్లర సమస్య లేకుండా కార్డులు స్వైపింగ్ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశముంది.