హైదరాబాద్

స్కాలర్‌షిప్ చెస్ టోర్నీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో చెస్ క్రీడను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాల, గురుకుల, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీవిద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా మొత్తం పది జిల్లాల్లో జిల్లాల వారీగా చెస్ టోర్నమెంట్‌లను నిర్వహించిన అనంతరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. టోర్నమెంట్ ప్రైజ్‌మనీ మొత్తం రూ.3లక్షల 60వేలు, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో బాలబాలికల్లో మొదటి స్థానంలో నిలిచిన ఇద్దరికి చేసి రూ.10వేల చొప్పున, మిగతా ఎనిమిది మందికి చెరి వెయ్యి రూపాయల చొప్పున క్యాష్ అవార్డును అందజేస్తారు. జిల్లావ్యాప్తంగా టోర్నమెంట్ క్యాష్ ప్రైజ్ మొత్తం రూ.28వేలు. రాష్ట్ర స్థాయిలో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచిన బాలబాలికలకు మొదటి స్థానంలో నిలిచిన వారికి ట్రోఫీతో పాటు రూ.50వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.30వేలు నగదును బహూకరిస్తారు.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న పోటీలు బాలబాలికలకు కలిసి పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం ఖమ్మం, నల్గొండలో ప్రారంభమైన చెస్ పోటీలను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి ఆనంచిన్ని వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
కార్యక్రమంలో రెజోనెన్స్ విద్యా సంస్థల అధిపతి రాజావాసిరెడ్డి నాగేంద్రకుమార్, సీక్వెల్ రిసార్ట్స్ అధిపతి రామకృష్ణ ఏలూరి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పోలీస్ సంక్షేమ సంఘం సభ్యులు రమేష్, గోపికృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అకట్టుకున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలాజీనగర్, రిక్కాబజారు పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహూతులను అలరించాయి. దివ్యాంగులు చేసిన జానపద బాణీల నృత్యాలు ఇండోర్ స్టేడియం చప్పట్లతో మారుమోగింది.

వింటర్ ప్రిమీయర్ లీగ్ క్రికెట్ టోర్నీ

హైదరాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుబంధం కలిగిన నోబుల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వింటర్ ప్రిమీయర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 24 నుంచి 31వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వివిధ ప్లేగ్రౌండ్‌లలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో అండర్-14 విభాగంలో పోటీలు జరుగుతాయి. స్కూల్స్, కోచింగ్ అకాడమిలు, క్రికెట్ క్లబ్‌లు, వ్యక్తిగత టీమ్‌లు తమ దరఖాస్తులను ఈనెల 15వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. జనవరి1 2003లోపు లేదా తరువాతగాని జన్మించిన వారు పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గలవారు వివరాలకు టోర్నమెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఫాహిముద్దిన్ ఖాజాను ఫోన్ నెంబర్ 9290452954లో సంప్రదించాల్సి ఉంటుందని టోర్నమెంట్ నిర్వహకులు తెలిపారు.