హైదరాబాద్

ఉపాసనతోనే జ్ఞాన సంపద పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: లోభాలు వదలి వేదమార్గంలో నడిస్తే మనల్ని ధర్మం కాపాడుతుందని పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ శ్రీ విద్యా నృసింహ భారతీస్వామి ఉద్బోధించారు. శ్రీ పూర్ణయజ్ఞ కళాపీఠం నిర్వహణలో మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో హనుమత్ సుప్రభాతం, ఆంజనేయ నక్షత్రమాల ఆడియో క్యాసెట్‌ల ఆవిష్కరణ కార్యక్రమంలో స్వామీజీ ఆశీస్సులు అందించారు. బ్రహ్మపథం తెలిసిన బ్రాహ్మణుడు తెలుగు రాష్ట్రంలో వుండాలని, పాలిచ్చే గోమాత సుభిక్షంగా వుండాలని, పాలించే రాజులు ధర్మమార్గంలో నడవాలని వేదాల చెప్తున్నాయి కానీ ఈ మూడింటికి భిన్నగా ప్రస్తుతం కాలం నడుస్తోందని స్వామిజీ అన్నారు. వేద ధర్మాన్ని పాటిస్తే భవిష్యత్తులో భావితరాలకు సంపన్నం దొరుకుతుంది. ప్రాతఃకాలంలో దైవాన్ని స్మరిస్తే నూతన తేజస్సు వస్తుంది. ధర్మం మానవుని శరీరాన్ని ప్రతిక్షణం కదిలిస్తుంటుందని, మృత్యువు నాలుగు రకాలుగా మనిషిని అంటిపెట్టుకొని ఉంటుందని స్వామీజీ పేర్కొన్నారు. సూర్యుడు, వాయువు, మనస్సును ప్రలోభపెట్టే పంచభూతాలలో ముఖ్యమైనవి, వాటిల్ని ఆధీనంలో పెట్టుకోగలిగితే మనిషి జ్ఞానవంతుడే, కానీ ఆ జ్ఞానం అందరికి రాదు. కేవలం ఉపాసనతోనే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలమని స్వామీజీ ఉద్బోధించారు. బాలలకు అక్షరాభ్యాసం చేస్తాం. అదే ఉపాసన అని, తత్ఫలితంగా అక్షర జ్ఞానం కలుగుతుందని అన్నారు. హనుమత్ సుప్రభాతం సిడి గురించి మాట్లాడుతూ హనుమంతుడు చిరంజీవిగా పరబ్రహ్మ స్వరూపుడని అన్నారు. హనుమంతునికి తెలియని విద్యలేదు. జ్ఞానం అనే పరబ్రహ్మ స్వరూపంతోనే హనుమంతుడు భగవంతుడైనాడు అని స్వామీజీ తెలిపారు. ఉపాసకులు, ఋషులు, నిష్ణాతులు ఉన్న పుణ్యభూమి భారతదేశం. మరణానిస్తాననే భయం వద్దు. మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. శివుడు హనుమంతుని రూపంలో మనిషిలోని శక్తిని నింపుతున్నాడు. సత్యాన్ని నిర్భయంగా చెప్పే ప్రవచనాలు మనిషి వినాలి అప్పుడే అజ్ఞానం తొలగిపోయి పరిపూర్ణ ఆనందంతో వుండగలుగుతాడని విద్యా శంకర భారతీ స్వామీజీ బోధించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి మాట్లాడుతూ హనుమాన్ సుప్రభాతంలోనే హనుమంతుడు కనిపిస్తాడు అని ఈ సుప్రభాతానికి గళం అందించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అభినవ ఆంజనేయుడేనని అన్నారు. చెన్నై తుపాన్ బీభత్సం నుండి నగరానికి రాగలిగారంటే ఆంజనేయుడు ఆవహించాడనే అనుకోవాలి. అది దైవ సంకల్పం అని అన్నారు. పండితారాధ్యుల వంశం నుండి వచ్చిన గాయకరత్నం బాలు అని, ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తాడో వారికి ఆయష్షు, బలం, తేజస్సు పెరుగుతుందని, గురువు, తల్లి, తండ్రి త్రిమూర్తులని రమణాచారి అన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్త ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించగా, సామవేదం షణ్ముఖశర్మ, మామిడి హరికృష్ణ, వేమూరి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొనగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తన గళంతో ప్రేక్షకులను అలరించగా తొలుత ముట్నూరి కామేశ్వరరావు స్వాగతం పలికారు. కార్యక్రమానికి ప్రారంభంలో నాట్యాచారిణి ఉషాగాయత్రి శిష్యురాలు శిరీష తన నృత్యాభినయంతో ప్రేక్షకులను అలరించింది.

బుక్‌ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సూచించారు. మంగళవారం ఆంధ్ర మహిళా సభలో జరిగిన ‘పుస్తక పఠనం’ అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ బుక్ ఫెయిర్ అనేది అమ్మకోసం కాకుండా విద్యార్థులకు, ప్రజలకు సాహిత్యాన్ని అందించేందుకు నిర్వహించటం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి, సాహిత్యాన్ని చదవటంతో పాటు ప్రశ్నించే అలవాటు నేర్చుకోవాలన్నారు. ఈ దేశ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు.
అధ్యయనం అనేది మనిషిని ఉన్నత మార్గంవైపు నడిస్తుందన్నారు. మహిళలు ఏదైనా అనుకుంటే అది సాధించగలరని, దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ ఈ దేశానికి ఎంతో సేవ చేసిందని గుర్తుచేశారు. తన ఆస్తులు సైతం అమ్ముకుని వైద్య విద్య అందించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సాహిత్యోత్సవాల కన్వీనర్ డా.రఘు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర సాహిత్య పుస్తకలాను చదవాలని మహానీయుల జీవిత చరిత్రలను చదవటం వల్ల సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత తంగిరాల చక్రవర్త అధ్యక్షత వహిస్తూ బుక్‌ఫెయిర్ గత 30 సంవత్సరాలగు నిర్వహించటం జరుగుతోందని, ఉపాధ్యాయ,విద్యార్థులు, మేధావులు మధ్య తరగతి వారికి అనేక విజ్ఞానదాయక పుస్తకాలను, వివిధ పబ్లికేషన్స్ ఒకే చోటుకు తీసుకువచ్చి బుక్‌ఫెయిర్ నిర్వహణ అధ్యయన ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సుందరయ్య అభ్యర్థన మేరకు డా.చుక్కారామయ్య వయోజనులకు విద్య నేర్పి, అక్షర ప్రాధాన్యతను తెలియజేసి సామాన్యులను అసమాన్యులుగా తీర్దిదిద్దారని, అక్షరం అజేయునిగా తీర్చిదిద్దుతుందన్నారు. కార్యక్రమంలో కళాకారుడు కోట ఆంజనేయులు తన పాటలతో విద్యార్థుల్ని చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అంటూ..ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ సహాయక కార్యదర్శి శోభన్‌బాబు, నిర్వాహకులు సురేశ్, కళాశాల అధ్యపకులు పద్మజ, దివ్య తదితరులు పాల్గొన్నారు.