హైదరాబాద్

రూ. 2వేల నోటు వద్దు.. రూ. 100 నోటు ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: నల్లధనాన్ని వెలికితీయటంతో పాటు నకిలీ కరెన్సీకి బ్రేక్ వేసేందుకు కేంద్రం వెయ్యి, 500నోట్లను రద్దు చేసి 37రోజులు పూర్తయినా, నగదు కొరత, చిల్లర కష్టాలు తీరనేలేదు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి, 500 రెండు రకాల నోట్లను రద్దు చేసి, 2వేల కొత్త కరెన్సీ నోటును అందుబాటులోకి తేవటంతోనే చిల్లర కష్టాలు పెరిగాయని జనం వాదిస్తున్నారు. గంటల తరబడి ఏటిఎంల నుందు క్యూలో నిల్చుంటే కేవలం రూ. 2 వేల వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశముంది. అదీ కొత్త 2వేల నోటు మాత్రమే ఏటిఎంల నుంచి వస్తుండటంతో, ఆ నోటుకు చిల్లర దొరక్క ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ. 2వేల నోటును చూడగానే ఖాతాదారులు, వ్యాపారులు ఖంగుతింటున్నారు. ఇందులో వెయ్యి రూపాయలు కొనుగోలు చేసినా, చిల్లర దొరకక జనం చిల్లరో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. ఇక రద్దయిన వెయ్యి, 500 నోట్ల స్థానాన్ని ప్రస్తుతం వంద, రూ. 50 రూపాయల నోట్లు భర్తీ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో మాత్రమే వంద, రూ. 50 నోట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మరికొన్ని కిరాణ జనరల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లతో పాటు హోటళ్లు, వైన్ షాపుల్లో పది శాతం కమిషన్‌కు ఈ చిల్లర దందా ఇంకా కొనసాగుతోంది. ఈ రకంగా మార్చుకున్న రూ. వంద, రూ. 50, 20 రూపాయల నోట్లను చాలా మంది ఖర్చు చేయకుండానే జమకు పరిమితం చేయటం, అలాగే బ్యాంకులకు కూడా అంతంతమాత్రంగా వచ్చే నగదు కేవలం రూ. 2వేల నోట్లతోనే వస్తుండటంతో చిల్లర కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక రద్దు చేసిన వెయ్యి, 500 నోట్లలో ఇప్పటికే వెయ్యి నోటు చెలామణికి బ్రేక్ వేసిన కేంద్రం, దాన్ని కేవలం బ్యాంకు ఖాతాలోనే జమ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇక రూ. 500 నోటుతో అత్యవసర సర్వీసులైన వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించేందుకు కల్పించిన వెసులుబాటు కూడా గురువారం రాత్రితో ముగిసింది. ఇక నేటితో రూ. 500 నోట్లు కూడా కేవలం బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు మాత్రమే పరిమితమైంది. నిన్నమొన్నటి వరకు కనీసం ఈ రూ. 500నోటును జమ చేసేందుకు బ్యాంకులో క్యూలైన్‌లో నిల్చుండాల్సిన వారు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిసిటీ, కరెంటు బిల్లులు, మెడిసిన్ కొనుగోళ్లకు వినియోగించే వారు. కానీ దీని చెలామణికి కూడా గడువు ముగియటంతో వీటిని జమ చేసేందుకు వచ్చే వారితో బ్యాకుల్లో నేటి నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశముంది.