హైదరాబాద్

2020 ఒలింపిక్స్ అర్హత పోటీల పోస్టర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: జాతీయ యువ కోఆపరేటివ్ సొసైటీ(ఎన్‌వైసిఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 2020, 2024 ఒలింపిక్స్ ధ్యేయంగా గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులు, క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం జరుగుతుంది. ఈనెల 24న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గైల్ ఇండియా స్పీడ్ స్టార్ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అండర్-14, 17 బాలబాలికల కోసం నిర్దేశించిన సమయంలో 100, 200, 400 మీటర్ల పరుగు పందేంలో పోటీలు జరుగుతాయి. పోటీలో గెలుపొందిన వారిని ఎంపిక చేసి దక్షిణ మండంలం పోటీలో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఫైనల్ పోటీలో గెలుపొందిన వారిని ఎంపిక చేసి పూర్తిక ప్రభుత్వ సహకారంతో విద్యతో పాటు క్రీడా శిక్షణను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. అవకాశాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. లాల్‌బహదూర్ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో నల్గొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎన్‌వైఎస్‌సి స్టేట్ కో ఆర్డినేటర్ పజ్జురి వెంకట్‌రెడ్డి, హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఇన్‌చార్జి నర్సయ్య, రంగారెడ్డి జిల్లా ఎన్‌వైసిఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్, జనవరి 9: పాతబస్తీలో కార్మాగారాల్లో మగ్గిపోతున్న 13 మంది మైనర్ పిల్లలకు విముక్తి లిభించింది.
భవానీనగర్ పోలీస్టేషన్ పరిధిలోని నశేమన్ నగర్‌లో గాజుల పరిశ్రమపై దక్షిణ మండలం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరిశ్రమలో పనిచేస్తున్న 21 మందిని పోలీసులు గుర్తించగా వారిలో మైనర్లు 13 మంది ఉన్నారు. మైనర్ బాలురను విడిపించారు. పరిశ్రమను నడిపిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరిశ్రమపై కేసు నమోదు చేశారు.

ఈవ్‌టీజర్‌పై తొలిసారి
తెలంగాణలో పిడి యాక్ట్

హైదరాబాద్, జనవరి 9: ఈవ్ టీజర్లపై తొలిసారిగా పిడి చట్టానిన ప్రయోగించిన్నట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. యువతిని పలు మార్లు వేధించిన రామగుండం ఆటోనగర్ ఎన్‌టిపిసి ప్రాంతానికి చెందిన బిజినేస్‌మెన్ జీవన్ ఆర్వార్‌శర్మ అలియాస్ జీవన్‌శర్మ(24)ను పిడి చట్టం కింద నిర్భంధించినట్లు రాచకొండ సిపి మహేష్‌భగవత్ పేర్కొన్నారు. దీనితో నేరాలు అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపుచేయడానికి ఇది ఎంతాగానో ఉపయోగపడుతుందని మహేష్‌భగవత్ పేర్కొన్నారు. ఈవ్ టీజర్లపై పిడి యాక్ట్ అమలు చేయడం ఇది తెలంగాణలోనే కాకుండా దేశంలో మొదటిదని పోలీసులు వర్గాలు తెలుపుతున్నాయి.