హైదరాబాద్

మందకొడిగా.. ప్రశాంతంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: సికింద్రాబాద్ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పది రోజులుగా ఆయా రాజకీయపార్టీలు పడుతున్న ఉత్కంఠకు మంగళవారం ఎన్నికల ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయా రాజకీయ నాయకుల భవిష్యత్ ఇవిఎం మిషన్లలో నిక్షిప్తమైంది. ఫిబ్రవరి 5న శుక్రవారం ఎన్నికల కౌంటింగ్‌తో ఎవరి భవితవ్యం ఏంటో తేలిపోతుంది. పది రోజులుగా నిద్రాహారాలు మాని ప్రచారాలు నిర్వహించిన నేతలు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట, సీతాఫల్‌మండి, బౌద్దనగర్ డివిజన్‌లలో పోలింగ్ శాతం గతం కన్నా కొద్దిగా పెరిగిప్పటికీ ఆశించిన స్థాయిలో ఓటర్లు ఓటింగ్‌లో పాలుపంచుకోలేకపోయారు. అడ్డగుట్ట, లాలాపేట్, మాణికేశ్వర్‌నగర్, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో సైతం పోలింగ్ పెద్దగా ఆశాజనకంగా లేకపోవడం రాజకీయ పార్టీల నేతల్లో, అధికారుల్లో అసహనం కనిపించింది. ప్రభుత్వంతోపాటు పలు సామాజిక సంస్థలు ప్రచారాలు నిర్వహించినప్పటికీ ప్రజల్లో అవగాహన రాకపోవడం శోచనీయంగా ఉంది. అక్షరాశ్యత కలిగిన తార్నాక తదితర ప్రాంతాల ప్రజలు కూడ సెలవు దొరికిందని ఇంటికి పరిమితయ్యారే తప్ప ఓటు హక్కు తమ కనీస బాధ్యత అని మాత్రం మర్చిపోవడం శోచనీయం. తమ ప్రాంతాల్లో సమస్యలున్నాయని గగ్గోలు పెట్టడం సరే మరి హక్కులు కాదు కనీసం ప్రజాస్వామ్యం కల్పించిన బలమైన ఆయుధం వ్యక్తి ప్రాధమిక హక్కును వినియోగించుకోవాలన్న ఆలోచన రాకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ఎన్నికలను నిర్వహించి స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో అధికార వికేంద్రికరణ అభివృద్ధికి దోహదం చేసే చర్యలకు చదువుకున్న వారు సైతం అర్థం చేసుకోలేక ఓటు హక్కును వినియోగించుకోకపోవడం శోచనీయమని పలువురు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండు డివిజన్‌లలో కొద్దిగా పోటీ ఉన్నప్పటికీ మిగిలిన డివిజన్‌లలో కారు స్పీడు పెరిగినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా గెలుపుపై ఎవరికివారు ధీమాతో ఉన్నారు. కాగా తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకాచంద్రారెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ముషీరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత డాక్టర్. లక్ష్మణ్.. సొంత నియోజకవర్గం కావటంతో పోలీసు వర్గాలు, నిఘా విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. హోం మంత్రి అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్ డివిజన్ నుంచి, నియోజకవర్గ ఇన్‌చార్జి ముఠా గోపాల్ సోదరుడి భార్య గాంధీనగర్ డివిజన్ నుంచి, ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కవాడిగూడ డివిజన్ నుంచి పోటీ చేయటంతో ముషీరాబాద్ నియోజకవర్గంపై అన్ని వర్గాలు ఆసక్తతో దృష్టి సారించాయి. రాంనగర్‌లోని రిసాలగడ్డలో నాయిని, అడిక్‌మెట్‌లో దత్తాత్రేయ, సిటీ సెంట్రల్ లైబ్రరీలో లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అడిక్‌మెట్‌లో టిడిపి, బిజెపి పొత్తు చిత్తయ్యి, ముషీరాబాద్ డివిజన్‌లో స్వతంత్య్ర అభ్యర్ధి సుప్రియ నవీన్‌గౌడ్ బిజెపి ఓట్లు చీల్చటంతో టిఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సవాలలో మునిగితేలుతున్నారు. కవాడిగూడ, రాంనగర్‌లో టిడిపి-బిజెపి మిత్రపక్షాల అధికారిక అభ్యర్ధులు బరిలో ఉండటంతో టిఆర్‌ఎస్, మిత్రపక్షాల అభ్యర్ధుల మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది.
మారిన పొలింగ్ బూత్‌లు..ఓటర్లకు తప్పని తిప్పలు
డివిజన్ల పునర్‌విభజన అనంతరం మారిన రూపురేఖలతో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఓటర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. పోలింగ్ బూత్‌లు మారటంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకొవటానికి ఓటర్లు అష్టకష్టాలు పడ్డారు. గతంలో ఆయా పార్టీల ప్రతినిదులు ఓటరు స్లిప్పులను ఇంటింటికే తెచ్చి ఇచ్చేవారు. ఈసారి ఆ బాధ్యత జిహెచ్‌ఎంసి తీసుకున్నా అమలు కార్యరూపం దాల్చలేదు. ఇంటర్నెట్ ద్వారా పోల్ స్లిపస్పలను డౌన్‌లోడ్ చేసుకనేలా కల్పించిన అవకాశాన్ని మెజారిటీ ఓటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. నియోజకవర్గంలో 330 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దాదాపు 2వేల మంది సిబ్బంది పాల్గొన్నారు.
భోలక్‌పూర్, ముషీరాబాద్ తదితర సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించారు.
పోలింగ్‌కు ఎన్‌సిసి సేవలు
జిహెచ్‌ఎంసి పోలింగ్‌లో ఎన్‌సిసి క్యాడెట్లు తమవంతు సేవలందించారు. వీరిలో సీనియర్ డివిజన్ ఆర్మీ వింగ్ క్యాడెట్ల సేవలను పలువురు అభ్యర్థులు, ఉన్నతాధికారులు, ఓటర్లు సైతం అభినందించారు. వీరంతా పోలింగ్ బూత్‌ల వద్ధ విధులు నిర్వహిస్తూ వృద్థులు, వికలాంగులను పోలింగ్ బూత్‌లలోకి తీసుకెళ్లి, వారికి సహకరించారు. మరికొన్ని చోట్ల ఓటరు స్లిప్‌లు లేని ఓటర్లకు అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బందిని సంప్రదించి స్లిప్‌లను ఇప్పించారు. మలక్‌పేట, అంబర్‌పేట, సైదాబాద్ పోలీస్ స్టేషన్లతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతంలో కూడా వీరు తమ సేవలందించారు. ఇక కళ్లు సరిగ్గా కన్పించని వృద్ధులు, సక్రమంగా నడవలేని వికలాంగులను పోలింగ్ బూత్‌లకు కొంత దూరం వరకు వెళ్లి, ఆటో, రిక్షాలు ఎక్కించి బాయ్..! చెప్పటం కన్పించింది.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ప్రముఖులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 2: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో గవర్నర్ నరసింహాన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంనగర్‌లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, కాచిగూడలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మారెడ్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓటు వేశారు. బంజారాహిల్స్‌లోని సెయింట్ నిజామ్స్ హై స్కూల్‌లో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ దంపతులు, జూబ్లీహిల్స్ బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు బాలకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉదయం ఏడు గంటల సమయంలో బేగంపేటలోని చిన్మయ పాఠశాలలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి.జనార్దన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్ ఎన్‌ఐఆర్‌డి సమీపంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 13లో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తన కుటుంబ సభ్యులతో ఓటు వేశారు.