హైదరాబాద్

త్వరలో గ్రామ పంచాయతీలుగా తండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జనవరి 18: గిరిజన తండాలను పంచాయతీలుగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రి చందూలాల్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కె.జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి హాజరయ్యారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 51 గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలపారు. బంగారు తెలంగాణ నిర్మాణం ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వెల్‌సెంటర్లను నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్న విస్తరిస్తామన్నారు. తెలంగాణ పునఃనిర్మాణానికి ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దాదాపు రూ.35 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు చేపట్టిన్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభమైన డైరీల ఆవిష్కరణ సంస్కృతి నేటికీ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టలో ఇచ్చిన హామీలు కాస్త ఆలస్యంగానైనా అన్నీ అమలవుతాయని హామీనిచ్చారు.