హైదరాబాద్

ప్రతి శనివారం బస్తీల్లో పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: అరకొర వసతుల మధ్య నలిగిపోతున్న మురికివాడల్లో ఇకపై ప్రతి శనివారం పర్యటించి, అక్కడ దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
ఈ మేరకు ఆయన శనివారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని భోలక్‌పూర్, కృష్ణానగర్, హరిజనబస్తీ, సుందరయ్యనగర్‌కాలనీ, బర్కల్ బస్తీ, చిన్న కమేలా, మేకలమండి బస్తీల్లో స్థానిక కార్పొరేటర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 సంతవ్సరాలుగా బస్తీల్లో ఉంటున్న పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించటంతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని గుర్తించిన ప్రభుత్వ ఆ దిశగా పలు చర్యలు చేపట్టిందన్నారు. అంలో భాంగానే పలు బస్తీల్లో స్థానికుల సుముఖతతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.
బన్సీలాల్‌పేటలోని పలు బస్తీల్లో గల సమస్యలను తెలుసుకునేందుకు ఆయా శాఖల అధికారులతో బస్తీల్లో పర్యటిస్తున్నామని తెలిపారు.
భోలక్‌పూర్ ప్రాంతంలోని హరిజన బస్తీతో సహా మొత్తం బస్తీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన పరిస్థితులను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 25న రెవెన్యూ, హౌజింగ్ తదితర శాఖలు ఇందుకు అవసరమైన సర్వేను నిర్వహించాల్సిందిగా సూచించారు.
బస్తీల్లోని కొన్ని చోట్ల ఎత్తు ప్రాంతాల్లో ఇళ్లు ఉండటం వల్ల మంచినీటి సమస్య ఉందని స్థానికులు దృష్టికి తేగా, దాన్ని అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త తడి,పొడి చెత్తను వేర్వేరు చేయాలని చెప్పిన ప్రజలకు అవగాహన కలగటం లేదని, అందుకే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిహెచ్‌ఎంసి ఆటో రిక్షాల ద్వారా చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
కృష్ణానగర్ భోలక్‌పూర్ కమ్యూనిటీ హాళ్లలో గతంలో మంజూరు చేసిన కుట్టుమిషన్లు పరిశీలించి, ఎంత వరకు వాటిని వినియోగించుకుంటున్నారో స్థానిక మహిళలను అడిగి తెల్సుకున్నిరు. పాఠశాల కమిటీ, స్థానిక కోరిక మేరకు భోలక్‌పూర్ ప్రభుత్వ పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసేందుకు రతగు చర్యలు తీసుకోవల్సిందిగా డిప్యూటీ డిఇవోను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్లు ఆకుల రూప, జోనల్ కమిషనర్ శంకరయ్యతో పాటు ఇతర విభాగాల అధికారులున్నారు.