హైదరాబాద్

షి టీమ్స్‌తో భద్రత.. ఎవరూ భయపడవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర అదనపు కమిషనర్, షీ టీమ్స్ చీఫ్ స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. సోమవారం ఉస్మానియా వైద్య విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ‘సైబర్ నేరాలు-మహిళలు-్భద్రత’ అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో స్వాతిలక్రా మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా వందకు పైగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, రెండేళ్లలో మహిళలపై జరుగుతున్న ఎన్నో దాడుల్ని అరికట్టగలిగామన్నారు. షీ టీమ్స్ నిర్వహణ, విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేశామని, కొంత మందిపై కేసులు నమోదు చేస్తూ, మరికొందరికి వారి కుటుంబీకుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించామని అన్నారు. మహిళలకు భద్రత కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన షీటీమ్స్, భరోసా కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. తమను వేధింపులకు గురిచేసే వారిపై వెంటనే ఫిర్యాదు చేయాలని, నిర్భయంగా ముందుకు వస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్వాతిలక్రా తెలిపారు. అదనపు నగర కమిషనర్ రంజన్ రతన్ కుమార్, సుల్తాన్‌బజార్ ఏసిపి చవ్రర్తి, ఏసిపి కవిత, అరోరా డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపాల్ బి.విశ్వనాథం, మహిళావిభాగం అధికారులు చంద్రకళ, సత్యవతితోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన 800 మంది విద్యార్థినులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.