హైదరాబాద్

వారంలోపు ఏ సమస్యకైనా పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి వచ్చిన ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించి, వారి పురోగతిని అధికారులకు తమకిచ్చిన లాగిన్‌లో అప్‌డేట్ చేయాలని జిల్లా జేసి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో భాగగంగా ఎస్‌డిపి మధుమోహన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జహురుద్దిన్‌లు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఆ తర్వాత మీ కోసం ఆర్జీలపై జాయింట్ కలెక్టర్ ప్రశాంతి శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ కోసంలో వచ్చే ప్రతి ఆర్జీని వారంలోపు పరిష్కరించాలని, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని సూచించారు. జనవరి నుంచ ఇ వారం వరకు మొత్తం 80 పిటిషన్లు రాగా, వాటిలో 24 పరిష్కరించినట్లు, మూడు తిరస్కరించగా, 57 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బహద్దూర్‌పురా మండల కార్యాలయంలో 8 ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, అదే విధంగా మైనార్టీ శాఖలో మూడు, విద్యా శాఖలో నాలుగు, వైద్యారోగ్య శాఖలో రెండు ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటన్నింటిని పరిష్కరించి ఆ సమాచారాన్ని సంబంధిత సిస్టమ్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాతో పాటు తహసిల్దార్ల కార్యాలయాల్లో నిర్వహించే మీ కోసం ఆర్జీల వివరాలు కూడా మీ కసం వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు.
స్వీకరించిన అర్జీల వివరాలు
మీ కోసం కార్యక్రమంలో అధికారులు స్వీకరించిన ఆర్జీల్లో నాంపల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ తన 8 ఏళ్ల కొడుకు వంశీ మానసిక వికలాంగుడని, అతనికి పెన్షన్‌తో పాటు శాశ్వత బస్‌పాస్ ఇవ్వాలని కోరుతూ ఆర్జీని సమర్పించారు. ఇందుకు స్పందించిన జేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వికలాంగుల శాఖ ఏడిని ఆదేశించారు.
నాంపల్లి మండలానికి చెందిన దుర్గా నాగేష్ దంపతులు సంవత్సరంన్నర వయస్సున్న తమ కూతరుకు గుండె ఆపరేషన్ చేయించాల్సి ఉందని, తమకున్న ఆరోగ్యభద్రత కార్డులో పొరపాటున తాము సర్కిల్ 9లో నివాసముంటున్నట్లు పేర్కొన్నారని, దీన్ని సవరించాలని కోరుతూ ఆర్జీని సమర్పించారు. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ జేసి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ముషీరాబాద్ మండలంలోని బాకారం ప్రాంతానికి చెందిన వేణు అనే వ్యక్తి తాము ఎన్నో సంవత్సరాలుగా ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ చాలీచాలని జీతంతో బతుకున్నానని, తనకు డబుల్ బెడ్ రూం ఇళ్లును కేటాయించాలని కోరుతూ దరఖాస్తును సమర్పించారు. ఈ ఆర్జీని జేసి హౌజింగ్ అధికారులకు అందజేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాలాల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం
నాలా పూడికతీత పనులన్నీ సోషల్ ఆడిట్ జవాబుదారి తనాన్ని పెంచేందుకు గ్రేటర్ కృషి

హైదరాబాద్, ఫిబ్రవరి 6: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి కాస్త ముందుగా నాలాల్లోని పూడికతీత పనులను ప్రారంభించిన జిహెచ్‌ఎంసి పనుల్లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు ప్రతి పనిని సోషల్ ఆడిట్ చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కమిషనర్ జనార్దన్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా ఆదేశించారు. పాతబస్తీలోని మోహల్లాకాలనీలోని నాలాల్లో పడి ఓ బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని కమిషనర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించారు. నాలాలపై నేటికీ ఆక్రమణలు వెలుస్తుండటాన్ని గమనించిన కమిషనర్ టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాలాల్లో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి తగు నష్టపరిహారం అందజేయటంతో పాటు అతని తల్లిదండ్రులకు బ్యాంకు ద్వారా తగిన రుణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఇదివరకు నగరంలో చేపట్టిన నాలాల పూడికతీత పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలకు చెక్ పెట్టడానికి పనులను సంవత్సరం పొడువున నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి పనికి సంబంధించి స్థానికుల సంతకాలు సేకరించటం, నాలాల్లో నుంచి బయటకు తీసిన పూడిక పరిమాణాన్ని అప్పటికపుడు తెలిజేస్తున్నట్లు తెలిపారు. నాలాల్లో వ్యర్థాలను వేయటం, ఆక్రమణలకు పాల్పడటం, అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రత్యేక సర్వే చేసి గుర్తించిన నాలాల ఆక్రమణలను తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. పాతబస్తీలో కూడా పు ప్రాంతాల్లో నాలాలను ఆక్రమించి కట్టడాలు చేపట్టారని, నాలాల్లో వ్యర్థ పదార్థాలను వేయటం, అడ్డంగా స్లాబులు నిర్మించటం వల్లే నీరు సక్రమంగా ప్రవహించటం లేదని కమిషనర్ వివరించారు. పాతబస్తీ సమస్యలన్నీ పరిష్కరించేందుకు అధికారులు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పాతబస్తీలో ప్రజాసమస్యల పరిష్కారంపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
కలిసి వెళ్లండి
నాలాలపై వెలసిన ఆక్రమణలను, ఇష్టారాజ్యంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించేందుకు పోలీసు, వాటర్ వర్క్స్, ఇతర సంబంధిత శాఖల అధికారులు కలిసి వెళ్లాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. నాలాలపై ఆక్రమణలను గమనించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, క్షేత్ర స్థాయిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయంటూ అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, ఆయన పైన పేర్కొన్న విధంగా స్పందించారు.