హైదరాబాద్

సమన్వయ సమావేశం..గొప్ప ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించే సమన్వయం సమావేశం(కన్వర్జెన్సీ మీటింగ్) అనేది దేశంలోనే అతి గొప్ప ప్రయోగం అని కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో ఈ విధమైన ఉన్నతాధికారుల సమావేశం ఏ నగరంలో జరగలేదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్ హోటల్ మారియేట్‌లో అర్బన్ డెవలప్‌మెంట్ సమ్మిట్ పేరిట జరిగిన సదస్సులో మున్సిపల్ పాలనలో మార్పులు అనే అంశంపై కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగరంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉన్నపుడే సమస్యలకు పరిష్కారం లభించి పలు పౌర సేవలు, వౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతంగా జరుగుతాయని అన్నారు. ఇందుకు గాను పలు విభాగాల అధికారులతో సిటీ కన్వర్జెన్సీ సమావేశం ఒక్కోసారి ఒక్కో ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించటం జరుగుతుందని వివరించారు. ఈ విధమైన సమావేశాలను డిప్యూటీ కమిషనర్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో సమీకృత వ్యర్థ పదార్థాల నిర్వాహణ పకడ్బందీగా జరుగుతుందని, స్వచ్ఛ ఆటోల ద్వారా వచ్చే వ్యర్థాలను 90 శాతానికి పైగా తడి,పొడి చెత్తగా వేరు చేసి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తేవటం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో మరే నగరంలో లేని విధంగా 44లక్షల డస్ట్‌బిన్లను నగరంలో ఉచితంగా అందించామని, 2వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఓ విప్లవాత్మక చర్య అని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవటం ద్వారా నగరవాసులకు ఉత్తమ పౌర సేవలు అందించటంలో జిహెచ్‌ఎంసి ముందంజలో ఉందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో ఇది నిరూపణ అయిందని వివరించారు. కేవలం నగర పాలన, పారిశుద్ద్యం, వౌలిక సదుపాయాల కల్పనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, స్వయం సహాయక మహిళలకు బ్యాంకు రుణాలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో మరే నగరంలో లేని విధంగా నగరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6వేల 891 స్వయం సహాయక బృందాలకు రూ. 215 కోట్లను రుణాలుగా అందించినట్లు తెలిపారు. అంతర్గత వనరులున పెంపొందించుకోవటం ద్వారా జిహెచ్‌ఎంసి ఆర్థికంగా బలోపేతం చేయటానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా నగర పాలన అనే అంశంపై సెంట్రల్ జోన్ కమిషనర్ హరిచందన ప్రసంగించారు. ఈ సమావేశంలో దేశంలోని వివిధ నగరాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్‌అదాలత్

హైదరాబాద్, ఫిబ్రవరి 10: సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఈ ఏడాది తొలి జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపింది. క్రిమినల్ కాంపౌండబుల్ నేరాలు, ఎన్‌ఐ చట్టం 138 సెక్షన్ కింద నమోదైనవి, బ్యాంక్ రికవరీ కేసులు, మ్యాక్ట్ కేసులు, మాట్రిమోనియల్, కార్మిక వివాదాలు, భూసేకరణ కేసులు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లుల వివాదాలు, రెవెన్యూ, ఇతర సివిల్ కేసులను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.