హైదరాబాద్

ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటే దేనినైనా సాధించవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఇ) అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె దలాల్ వ్యాఖ్యానించారు. గీతం యూనివర్శిటీ పూర్వ విద్యార్ధుల సంఘాన్ని ఆయన శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు ఉద్యోగాలు ఆశించే వారిగా కంటే ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగాలని అన్నారు. తాను 1002 రూపాయిలతో వ్యాపారంలోకి వచ్చానని, 40వేల రూపాయిలను దీనా బ్యాంకు రుణం ఇచ్చిందని, ఆ తర్వాత అదే బ్యాంకుకు డైరెక్టర్‌గా ఎదగగలిగానని తన పురోగతిని వివరించారు. మన వంతుగా నిబద్ధతతో ప్రయత్నం చేస్తూ పోతే ఓటమి అంటూ ఉండదని స్పష్టం చేశారు.
తాను వ్యాపారం ప్రారంభించిన రోజుల కంటే ప్రస్తుతం ఎన్నో రకాల సౌకర్యాలు, పరిజ్ఞానం , అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలో అత్యధికులు మంచి ఉద్యోగం దొరికితే చాలని ఆలోచిస్తారని, కాని గుజరాతీలు వ్యాపారంపై మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని అన్నారు. అందుకు ముద్రా బ్యాంకు, ఎంఎస్‌ఎంఇ, ఎంఎఏస్‌ఐసిలు ఎన్నో రకాల పథకాలతో తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.
బ్యాంకుల ద్వారా హామీ లేకుండానే రెండు కోట్ల వరకూ రుణం పొందే వీలుందని ఎపుడైనా వ్యాపార ప్రారంభంలో ఒడిదుడుకులు సహజమని, వాటిని అధిగమించే విశ్వాసం , ప్రోత్సాహం , ప్రేరణ, మార్గదర్శనం ఉండాలని అభిప్రాయపడ్డారు. భారత భవిత యువత చేతిలోనే ఉంటుందని , పనిచేస్తూ పోతే విజయాలు వరిస్తాయని దలాల్ ఉద్బోధించారు. పూర్వ విద్యార్ధులు ఎపుడూ వర్శిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ పేర్కొన్నారు. వ్యవస్థాపకులుగా ఎదిగే క్రమంలో కొంత రిస్క్ ఉంటుందని, ఫలితాలు ఒకింత ఆలస్యంగా వస్తాయని, వాటికి వెరవకుండా ముందుకు వెళ్లేవారే రాణిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రో వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్, ప్రిన్సిపాల్ సిహెచ్ సంజయ్,రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ, ఎం శ్రీ్భరత్ తదితరులు పాల్గొన్నారు.
శిలాఫలకాలకే పరిమితమైన తెరాస ప్రభుత్వం
ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం: టిడిపి
సికిందరాబాద్, ఫిబ్రవరి 11: తెరాస ప్రభుత్వం కేవలం హామీలతోనే సరిపెడుతూ కాలయాపన చేయడం తగదని తెదేపా నాయకుడు, నగర టిడిపి వ్యవహారాల ఇన్‌చార్జ్ ఇ.పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శనివారం టిడిపి నగర పార్టీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని లంబాడీ బస్తీలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకోసం సంవత్సరం క్రితం శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డితోపాటు టిడిపి సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి ఎం.ఆరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఆదరబాదరాగా హామీలను గుప్పించి శిలాఫలకాలు వేసి శంకుస్థాపనలు చేసిన తెరాస నాయకులు ఎన్నికల్లో లబ్ధిపొందిన తర్వాత పూర్తిగా చేసిన వాగ్దానాలను విస్మరించారని ఆరోపించారు. సిఎం కెసిఆర్ తన కుమారునికి నగరాన్ని మున్సిపల్‌శాఖను అప్పగిస్తే ఆయన నగరాన్ని పూర్తిగా మురికికూపంగా మార్చివేశారన్నారు. నగరంలో అపరిశుభ్ర వాతావరణంలో విషజ్వరాలు విజృంభించి విలయతాండవం చేస్తున్నాయని, దీంతో అన్ని ప్రభుత్వ, ప్రేవేటు ఆసుపత్రిలు రోగులతో కిటకిటలాడుతున్నాయన్నారు. ఇక ఎన్నికల ముందు రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చేసిన వాగ్దానాలు, వేసిన శిలాఫలకాలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. ఎక్కడపడితే అక్కడ శిలాఫలకాలు అప్పటిపుకప్పుడు ఓట్లు దండుకోవడానికి ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్‌లకు నిధులు, విధులు లేకుండా చేసి అభివృద్ధిని ఎక్కడికక్కడ నిలిపివేశారన్నారు. ఎలాంటి విధులు లేకుండా కార్పొరేటర్‌లను సంవత్సరం నుంచి ఖాళీగా ఉంచి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని టిడిపి నేతలు హెచ్చరించారు. నగరంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ ఎంఎన్.శ్రీనివాస్, కోకన్వీనర్ మేకల సారంగపాణి, కూన వెంకటేశ్‌గౌడ్, నల్లెల కిశోర్, మధుకర్, శ్రీపతిసతీష్ తదితరులు పాల్గొన్నారు.

వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా
ముషీరాబాద్, ఫిబ్రవరి 11: సుప్రీం కోర్టు తీర్పును సైతం ధిక్కరిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం భజానికెత్తుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని మాలమహానాడు గౌరవ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ శనివారం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చిన మాలమహానాడు నేతలను పోలీసులు అడ్డుకొని రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకముందు మీడియాతో కృష్ణస్వరూప్ మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు గ్రామీణ స్థాయిలో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలిపారు. ఓ వైపు సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తీర్పును వెల్లడించినా తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కేంద్రంలో నరేంద్రమోదీతో లాబీయింగ్‌ను ఆపాలని, అన్ని కులాల పట్ల సమభావం పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ కార్యదర్శి వి.్భస్కర్, తెలంగాణ అధ్యక్షుడు నక్కా రాజేందర్ రావు, నాయకులు రాజు, జగన్నాధం, బాబురావు, అరిసెల రాజు, కృష్ణ, దేవ ముత్యాలు, దేవేందర్, కొప్పుల రమేష్ పాల్గొన్నారు.
జెఎన్‌యూ విద్యార్ధి నజీబ్
అదృశ్యం వెనుక ఏబివిపి హస్తం
ముషీరాబాద్, ఫిబ్రవరి 11: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వంద రోజుల క్రితం అదృశ్యమైన ఎమ్మెస్సీ విద్యార్ధి నజీబ్ అదృశ్యం వెనుక ఏబివిపి హస్తం ఉందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. వెంటనే వారిని శిక్షించి నజీబ్ ఆచూకీ రాబట్టాలని జెఎన్‌యు పరిపాలనా విభాగాన్ని డిమాండ్ చేసింది. శనివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు లాయక్ హైమద్ ఖాన్, ఖరీంఖాన్, యాతర్ అలి, ఫరాన్ మాట్లాడారు. గత సంవత్సరం అక్టోబర్ 14 రాత్రి ఏబివిపి విద్యార్ధి సంఘం నేతలతో ఘర్షణ చోటుచేసుకుందని, ఆ మరుసటి రోజు నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. నజీబ్‌ను ఏబివిపి విద్యార్ధులే కిడ్నాప్ చేశారని, నజీబ్ ఆచూకీ తెలియకపోవడం ఒక మిస్టరీగా నిలిచిందన్నారు. ఈ ఘటనపై నజీబ్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు నజీబ్ ఆచూకీని తెలుసుకోవడానికి బదులు కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసి, అసలు దోషులకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నజీబ్ కుటుంబానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని 25 లక్షల సంతకాలు సేకరించి జాతీయ మైనారిటీ కమిషన్‌కు సమర్పిస్తామని వారు తెలిపారు.