హైదరాబాద్

భక్త్భిజన సంకీర్తనలకు యువతరాన్ని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: చరిత్రకాలం నుండి విశిష్టత పొందిన భక్తి భజనలు గ్రామాల నుండి పట్టణాల వరకు అభివృద్ధి చెందాలంటే భక్తి సంకీర్తనలకు యువతరాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి అన్నారు. భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ‘తెలంగాణ వాగ్గేయకర వైభవం-4’ భక్తి భజన సంకీర్తన పోటీలను జ్యోతి వెలిగించి రమణాచారి ప్రారంభించారు. భజన కార్యక్రమాలు బాగా ప్రాచుర్యం పొందడానికి భజన మండలి గాయకులు సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను ప్రాంతాలకు అతీతంగా భక్తి భావంతో చేపట్టాలని అన్నారు. భజన కళాకారులు ప్రాంతీయ, ఈర్ష్యా విభేదాలు లేకుండా ఓపిక, సహనం, పరస్పర ప్రేమ, అభిమానంతో పరస్పర అవగాహనతో కళను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భజన సంప్రదాయం చాలా గొప్పది. ఉన్నత చదువులు చదివిన, ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఫ్యాషన్ పేరుతో సగం బట్టలు వేసుకొని సంస్కృతిని దెబ్బ తీస్తున్నారని, ఎంతమందికి పద్యాల గొప్పతనం తెలుసునని అన్నారు. భక్తి కీర్తనలు, పద్యాలు పిల్లలు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు రోజుకి ఒక గంట ఇంట్లో పాడగలిగితే వాటి విలువ పిల్లలకు అర్థమవుతుందన్నారు. ఆనాటి స్కూళ్లకి వ్యత్యాసం డబ్బుమాత్రమే కనిపిస్తోందని, పిల్లలు సంస్కృతి మర్చిపోతున్నారని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు కూడా నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వాగ్గేయకారులున్నారు. భజన గాయకులున్నారు. వీరిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి నెలకు రూ.4వేలు పెన్షన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని కెవి రమణాచారి అన్నారు. తొలుత నిర్వాహకులు జెఎస్‌వి శివప్రసాద్ మాట్లాడుతూ భావితరాలకు భజన సంకర్తీనలు గుర్తుండేలా భజన సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. భజన సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయాలనిదే తమ సంకల్పం అని అన్నారు. గతంలో నిర్వహించిన మూడు విభాగాల భజన పోటీలలో గెలుపొందిన వారికి రమణాచారి బహుమతులు ప్రదానం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సహకారంతో సంకీర్తన ప్రచార పరిషత్ అధ్యక్షురాలు సుధారాణి సారథ్యంలో కొరుపోలు కృష్ణారెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొని భజన కళాకారులను అభినందించారు.